ETV Bharat / international

'మయన్మార్​లో పరిస్థితులను భారత్​ నిశితంగా పరిశీలిస్తోంది'

author img

By

Published : Feb 27, 2021, 5:35 AM IST

మయన్మార్​లో వీలైనంత త్వరగా ప్రజాస్వామ్య పరిపాలన రావాలని భారత్​ కోరింది. శాంతియుతమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది.

India monitoring developments in Myanmar
'మయన్మార్​లో పరిస్థితులను భారత్​ నిశితంగా పరిశీలిస్తోంది'

మయన్మార్​లో ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఐక్యరాజ్యసమితిలో భారత్​ శాశ్వత ప్రతినిధి టీఎశ్​ తిరుమూర్తి తెలిపారు. మయన్మార్​ నాయకత్వం ఐకమత్యంగా ఉండి వీలైనంత త్వరగా శాంతియుత పంథాలో సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్​ వెల్లడించింది.

"భారతదేశం మయన్మార్‌తో భూమి, సముద్ర సరిహద్దును పంచుకుంటుంది. ఆ దేశంలో శాంతి స్థాపనకు భారత్​ కట్టుబడి ఉంది. మయన్మార్​లో ఇటీవల పరిణామాలను భారత్​ నిశితంగా పరిశీలిస్తోంది. దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేసేందుకు మయన్మార్​ చేసిన కృషి నిర్వీర్యం కాకూడదు.

మయన్మార్​, ఆ దేశ ప్రజలకు అత్యంత దగ్గరి స్నేహితుడిగా వారికి సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. మాతో కలిసి వచ్చే దేశాలతో మయన్మార్​ ప్రజల ఆశలను ఎల్లప్పుడూ మేం గౌరవిస్తాం."

- టీఎస్​ తిరుమూర్తి, ఐరాసలో భారత్​ శాశ్వత ప్రతినిధి

సైన్యం హస్తగతం..

మయన్మార్‌ సైనిక బలగాలు తిరుగుబాటు చేసి ప్రభుత్వ పగ్గాల్ని చేజిక్కించుకున్నాయి. దేశంలో 2010లో ప్రారంభమైన పాక్షిక ప్రజాస్వామ్య ప్రభుత్వం తిరిగి నిరంకుశత్వం వైపు మళ్లింది. కౌన్సెలర్‌ ఆంగ్‌ సాన్‌ సూకి, అధ్యక్షులు ఉ విన్‌ మింట్‌తోపాటు, అధికార 'జాతీయ ప్రజాస్వామ్య లీగ్‌ (ఎన్‌ఎల్‌డీ)'కి చెందిన పలువురు సీనియర్‌ నేతలను బంధించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.