ETV Bharat / international

మయన్మార్​ సైన్యం ఖాతాలపై ఫేస్​బుక్​ నిషేధం

author img

By

Published : Feb 25, 2021, 11:42 AM IST

మయన్మార్​ హింసాత్మక ఘటనలపై తీవ్రంగా స్పందించింది ఫేస్​బుక్​. పదే పదే తమ సంస్థ నిబంధనలను అతిక్రమిస్తున్నారనే కారణంతో.. సైన్యం ఖాతాలు, వారి అనుబంధ కంపెనీల ప్రకటనలపై నిషేధం విధించింది.

Facebook bans all Myanmar military-linked accounts and ads
మయన్మార్​ సైనికుల​ ఖాతాలను నిషేధించిన ఫేస్​బుక్​

మయన్మార్​ హింసాత్మక ఘటనలపై సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో సైన్యం అధికారాన్ని చేజిక్కుంచుకున్న తరుణంలో.. ఆ విభాగానికి చెందిన మొత్తం ఖాతాలతో సహా వారి అనుబంధంలోని అన్ని కంపెనీల ప్రకటనలపై నిషేధం విధిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. హింసాత్మక విధానాలతో తమ సంస్థ నిబంధనలను మిలిటరీ పదేపదే ఉల్లంఘించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది ఫేస్​బుక్​.

సైనిక తిరుగుబాటు తర్వాత ఇప్పటికే ప్రముఖ మయవాడి టీవీ, టెలివిజన్​ బ్రాడ్​కాస్టర్​ ఎంఆర్​టీవీ సహా.. సైన్యానికి అనుసంధానమైన పలు ఖాతాలపై నిషేధం విధించింది. అంతేకాకుండా ఫేస్​బుక్​ యాజమాన్యంలో ఉన్న 'ఇన్​స్టాగ్రామ్​'లోనూ ఈ నిషేధాజ్ఞలు వర్తింపజేసింది.

ఆంగ్​ సూకీ ప్రభుత్వంతో పాటు ఆమె నేషనల్​ లీగ్​ ఫర్​ డెమోక్రసీ పార్టీని బహిష్కరించినుందుకు కొందరు సైనికాధికారుల ఖాతాలపై 2018లోనే నిషేధం విధించింది ఫేస్​బుక్​. నాడు.. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సీనియర్​ జనరల్​ మిన్​ ఆంగ్​ హేలింగ్​.. ప్రస్తుతం సైనిక ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.

ఇదీ చదవండి: 'ఆధునిక ప్రపంచంలో తిరుగుబాట్లకు స్థానం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.