ETV Bharat / international

చోటా లాడెన్​కు చిక్కులు

author img

By

Published : Mar 2, 2019, 3:10 PM IST

హమ్జా బిన్​ లాడెన్

చోటా లాడెన్​కు చిక్కులు

అల్​ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్​ కుమారుడు హమ్జా బిన్​ లాడెన్​ను ఐక్యరాజ్యసమితి బ్లాక్​లిస్టులో పెట్టింది. ఎలాంటి కారణాలు వెల్లడించకుండానే హమ్జా పౌరసత్వాన్ని సౌదీ అరేబియా రద్దు చేసింది.

అల్​ఖైదా అగ్రనేత ఒసామా బిన్​ లాడెన్​ కుమారుడు 29 ఏళ్ల హమ్జా బిన్​ లాడెన్​ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. హమ్జా ఆచూకీ తెలిపిన వారికి అమెరికా రివార్డు ప్రకటించిన మరుసటి రోజే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అతడ్ని బ్లాక్​లిస్టులో పెట్టింది. అల్​ఖైదా ప్రస్తుత నాయకుడు అల్​ జవహరీకి వారసుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.

అల్​ఖైదాలో హమ్జా అధికారిక సభ్యుడని, అనుచరులకు ఉగ్రదాడులు చేయాలని పిలుపునిచ్చినట్లు భద్రతా మండలి ఒక ప్రకటనలో తెలిపింది.

బ్లాక్​ లిస్టులో ఉంచటం వల్ల ప్రయాణం, ఆస్తుల లావాదేవీలు, ఆయుధాల కొనుగోలు లాంటి వాటిపై నిషేధం అమల్లోకి వచ్చింది.

పౌరసత్వం రద్దు...

ఎలాంటి కారణాలు వెల్లడించకుండా హమ్జా పౌరసత్వాన్ని శుక్రవారం సౌదీ అరేబియా రద్దు చేసింది.

1994లో సూడాన్​లో నివసిస్తున్న ఒసామా బిన్​ లాడెన్​ పౌరసత్వాన్ని ఇదే తరహాలో రద్దు చేసింది రాచప్రభుత్వం. ఆ కాలంలో హమ్జా చిన్న పిల్లాడు. అప్పటి నుంచి హమ్జా ఆచూకీ ఎవరికీ తెలియదు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.