ETV Bharat / international

ఏడాది క్రితం కొన్న 'వైన్​ బాటిల్'​లో పాము.. చచ్చి ఉంటుందిలే అని ఓపెన్ చేస్తే...

author img

By

Published : Mar 24, 2022, 4:43 PM IST

Chinese man bitten by venomous snake
Chinese man bitten by venomous snake

Chinese Man Bitten by Venomous Snake: ఏడాది క్రితం కొనుగోలు చేసిన వైన్​ బాటిల్​ ఓపెన్​ చేసిన వ్యక్తికి ప్రాణం పోయినంత పనైంది. ఆ సీసాలో ఉన్న ఓ విషపూరిత సర్పం.. ఒక్కసారిగా లేచి, అతడ్ని కాటేసింది. హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లిన ఆ వ్యక్తికి వైద్యులు సకాలంలో చికిత్స చేసి, బతికించారు.

Chinese Man Bitten by Venomous Snake: మూత బిగించి ఉన్న వైన్​ సీసాలో ఏడాదిపాటు పాము బతికే ఉంటుందా? బాటిల్ ఓపెన్ చేసిన వెంటనే ఒక్కసారిగా బయటకు వచ్చి కాటేస్తుందా? అవుననే అంటున్నాడు చైనాకు చెందిన ఓ వ్యక్తి. తన కుమారుడి చికిత్స కోసం కొనుగోలు చేసిన స్నేక్ వైన్ సీసాల విషయంలో ఇలానే జరిగిందని చెబుతున్నాడు.

ఏంటీ స్నేక్ వైన్?: చైనా సంప్రదాయ వైద్యంలో స్నేక్ వైన్ ఎంతో ప్రాచుర్యం పొందింది. దీని తయారీ కోసం.. వైన్​ను ఓ సీసా లేదా జార్​లో పోసి, అందులో ఓ విషపూరిత సర్పాన్ని పెడతారు. మూతపెట్టి, అనేక నెలలపాటు అలానే వదిలేస్తారు. అలా చేస్తే.. ఆ వైన్​ ఔషధంలా మారుతుందని.. రుమాటిసం, ఆర్థరైటిస్, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందన్నది చైనీయుల నమ్మకం. చైనా హీలాంగ్​జియాంగ్​కు చెందిన ఓ వ్యక్తి ఏడాది క్రితం మూడు స్నేక్ వైన్ జార్​లు కొన్నాడు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అతడి కుమారుడి చికిత్స కోసం వాటిని ఉపయోగించాలన్నది అతడి ఆలోచన. అయితే.. కొన్న వెంటనే వాటిని తెరవలేదు. ఎక్కువకాలంపాటు వైన్​లోనే పాము ఉంటే.. 'ఔషధ గుణాలు' మరింత బాగుంటాయని వాటిని అలానే వదిలేశాడు. ఇటీవల దాదాపు ఏడాది తర్వాత వాటిని తెరిచాడు. అయితే.. అనూహ్యంగా మూడు జార్లలోని పాములు బతికే ఉన్నాయని చెప్పాడు ఆ వ్యక్తి. వాటిలో ఒకటి తనను కాటేసిందని అన్నాడు. వెంటనే ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు చికిత్స అందించి తనను బతికించారని వివరించాడు.

Chinese man bitten by venomous snake
ప్రతీకాత్మక చిత్రం

అసలు సాధ్యమేనా?: వైన్​ జార్​లో ఏడాదిపాటు పాములు బతికే ఉన్నాయన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాలి లోపలకు వెళ్లేలాగా జార్​ మూత కాస్త తెరిచే ఉంచితే.. ఆల్కహాల్​లో పాములు బతికే ఉండగలవని కొందరు అంటున్నారు. కొన్ని జీవుల తరహాలో పాములు కూడా సుప్తావస్థలోకి వెళ్లగలవని.. అప్పుడు వాటికి చాలా తక్కువ మొత్తంలో ఆక్సిజన్ అవసరం అవుతుందని చెబుతున్నారు. సరీసృప జంతుశాస్త్ర నిపుణుడు ఉల్ఫ్​గ్యాంగ్​ విస్టర్ వాదన మాత్రం మరోలా ఉంది. "ఇది అసాధ్యం. ఆల్కహాల్​ వంటి ద్రావణంలో మునిగి ఉన్న ఏ పాము కూడా గంట కన్నా ఎక్కువ బతకలేదు. పాములకు అతీత శక్తులేమీ ఉండవు. అవి కూడా ఇతర జంతువుల్లాంటివే. వాటికి కూడా ఆహారం, నీళ్లు, ఆక్సిజన్​ కావాలి." అని వివరించారు ఉల్ఫ్​గ్యాంగ్.

ఇవీ చూడండి: తల్లి ఏజ్ 30.. కుమార్తెకు 14.. మనుమడి వయసు?.. ఇదొక క్రేజీ ఫ్యామిలీ స్టోరీ!

మూడో భర్తకు రెడ్‌ హ్యాండెడ్‌గా.. మొదటి ఇద్దరు భర్తలతో ఉండగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.