ETV Bharat / international

పాక్​ కోసం చైనా అంతరిక్ష కేంద్రం- ఏడాదిలోపే..!

author img

By

Published : Jan 29, 2022, 7:21 AM IST

China space station: పాకిస్థాన్​తో అంతరిక్ష సహకారాన్ని పెంపొందించే ప్రణాళికలను ప్రకటించింది చైనా. దీనిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పాక్​తో అంతరిక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొంది.

China to build space centre, more satellites for Pakistan
పాక్​ కోసం చైనా అంతరిక్ష కేంద్రం

China space station: అంతరిక్ష కేంద్రం అభివృద్ధి, మరికొన్ని ఉపగ్రహాల ప్రయోగం సహా పాకిస్థాన్‌తో అంతరిక్ష సహకారాన్ని బలోపేతం చేసే ప్రణాళికలను చైనా ప్రకటించింది. పాకిస్థాన్‌ కోసం సమాచార ఉపగ్రహాల అభివృద్ధికి ప్రాధాన్యం, పాకిస్థాన్‌ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి సహకారం అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు శ్వేతపత్రంలో ప్రకటించింది. చైనా నిర్మిస్తున్న సొంత అంతరిక్ష కేంద్రం ఈ ఏడాదికల్లా సిద్ధం కానుంది.

2018లో పాకిస్థాన్‌ ప్రయోగించిన రెండు ఉపగ్రహాలకు తోడ్పాటు అందించిన చైనా 2019లో అంతరిక్ష పరిశోధనలు, మిత్రదేశాల మధ్య అంతరిక్ష శాస్త్ర సహకారాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లే ఒప్పందంపై సంతకాలు చేసింది. పాకిస్థాన్‌, వెనిజువెలా, సుడాన్‌, అల్జీరియన్‌ ఉపగ్రహాలు కక్ష్యలో చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శుక్రవారం విడుదల చేసిన శ్వేతపత్రంలో చైనా వెల్లడించింది.

సౌదీఅరేబియా, పాక్‌, అర్జెంటీనా, బ్రెజిల్‌, కెనడా, లక్సెంబర్గ్‌ దేశాలు చేపట్టిన ఉపగ్రహ ప్రయోగాలకు సహకారం అందించింది. వచ్చే ఐదేళ్లలో అంతరిక్ష శాస్త్ర పరిశోధన, అంతరిక్ష గురుత్వాకర్షణ తరంగ గుర్తింపు కోసం ఉపగ్రహం, అధునాతన అంతరిక్ష ఆధారిత సౌర అబ్జర్వేటరీ కార్యక్రమాల అభివృద్ధి, పరిశోధనలు కొనసాగించన్నట్లు చైనా వెల్లడించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: చలికి గడ్డకట్టి.. అమెరికా సరిహద్దులో భారత కుటుంబం దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.