ETV Bharat / international

రోదసిలోకి చైనా వ్యోమగాములు- అసలు లక్ష్యం అదే!

author img

By

Published : Jun 17, 2021, 9:09 AM IST

Updated : Jun 17, 2021, 12:01 PM IST

సొంత స్పేస్ స్టేషన్ విస్తరణ కోసం ముగ్గురు వ్యోమగాముల బృందంతో కూడిన స్పేస్‌ క్రాఫ్ట్‌ను విజయవంతంగా ప్రయోగించింది చైనా. షెంఝౌ-12 స్పేస్ క్రాఫ్ట్‌ను.. స్పేస్ స్టేషన్ కోర్ మాడ్యూల్ టియాన్​ హేకు పంపింది.

china, space craft
చైనా, స్పేస్ క్రాఫ్ట్

సొంత అంతరిక్ష కేంద్రంలోకి ముగ్గురు చైనా వ్యోమగాములు

సొంత అంతరిక్ష కేంద్రం విస్తరణ దిశగా మరో కీలక ముందడుగు వేసింది చైనా. షెంఝౌ-12 స్పేస్​క్రాఫ్ట్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను స్పేస్​ స్టేషన్ కోర్ మాడ్యూల్ టియాన్​ హేకు పంపించింది. వాయవ్య చైనా గోబి ఎడారి ప్రాంతంలోని జియుక్వాన్ ఉపగ్రహ కేంద్రం​ నుంచి.. లాంగ్ మార్చ్-2ఎఫ్ క్యారియర్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు చైనా అధికారిక టీవీ ఛానల్ సీజీటీఎన్​ వెల్లడించింది. ఈ రాకెట్ సురక్షితంగా నిర్దేశిత కక్ష్యలోకి చేరుకుందని స్పష్టం చేసింది.

రోదసీలోకి వ్యోమగాములను పంపడం చైనాకు ఇది ఏడోసారి కాగా.. అంతరిక్ష కేంద్రం విస్తరణ కోసం పంపడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని చైనా మ్యాన్​డ్ స్పేస్​ ఏజెన్సీ(సీఎమ్​ఎస్​ఏ) వెల్లడించింది.

austronauts
ముగ్గురు వ్యోమగాములు

ముగ్గురు వీరే..

ముగ్గురు వ్యోమగాములు.. నే హెషాంగ్(56), లూ బామింగ్(54), టేంగ్ హంగ్బో(45) అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.

  • హెషాంగ్.. షెంఝౌ-7, షెంఝౌ-10 మిషన్​లో పాలుపంచుకున్నారు.
  • లూ బామింగ్.. షెంఝౌ-7 మిషన్​ కోసం పనిచేశారు.
  • టేంగ్ హంగ్బోకు ఇదే తొలి స్పేస్​ మిషన్ కావడం గమనార్హం.

మూడు నెలలు ఏం చేస్తారు?

అంతరిక్ష కేంద్రం విస్తరణ కోసం ఏప్రిల్​లో పంపిన కోర్​ మాడ్యూల్​ టియాన్​​​ హేలో ఉంటూ.. ముగ్గురు వ్యోమగాములు మూడు నెలల పాటు శాస్త్రపరిశోధనలు, మరమ్మతులతో పాటు.. స్పేస్​వాక్​లు చేయనున్నారు.

అంతరిక్ష కేంద్రంలో ముఖ్యంగా వీరు 4 పనులు పూర్తి చేయాల్సి ఉంది.

  • టియాన్​ హే మాడ్యూల్​ ఇన్​ ఆర్బిట్​ టెస్ట్
  • రీసైక్లింగ్​ అండ్ లైఫ్​ సపోర్ట్ సిస్టమ్​ వెరిఫికేషన్
  • రొబోటిక్ ఆర్మ్ టెస్టింగ్​ అండ్ ఆపరేషన్ ట్రైనింగ్
  • మేనేజ్​మెంట్​ ఆఫ్​ మెటీరియల్ అండ్ వేస్ట్.

ఈ నాలుగు పనులు ముగించాక పానరోమిక్ కెమెరా, పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నారు. స్పేస్​ సూట్ల పనితీరును పరీక్షించనున్నారు.

space craft
సొంత అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు చైనా వ్యోమగాములు

2016 రికార్డు బ్రేక్!

2016లో షెంఝౌ-11 మిషన్​ ద్వారా మానవ సహిత ప్రయోగం జరిపింది చైనా. నాడు 33 రోజుల పాటు వ్యోమగాములు రోదసిలో ఉన్నారు. అయితే.. ప్రస్తుతం జరిపిన ఈ ప్రయోగం ద్వారా చైనా తమ రికార్డును బ్రేక్​ చేయనుందని సీఎమ్​ఎస్​ఏ పేర్కొంది. ముగ్గురు వ్యోమగాములను మూడు నెలల మిషన్​ కోసం పంపినట్లు పేర్కొంది.

అప్పుడు ఇద్దరే..

2016లో ఇద్దరు పురుష వ్యోమగాములు షెంఝౌ-11 ద్వారా రోదసిలోకి వెళ్లారు.

ఇదీ చదవండి:

చైనా అంతరిక్ష కేంద్ర ప్రయోగం విజయవంతం

'చైనా అంతరిక్ష కేంద్రం ప్రయోగం వాయిదా'

Last Updated :Jun 17, 2021, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.