ETV Bharat / international

Afghanistan Taliban: విదేశీ సైనికుల ఒడిలో 'అఫ్గాన్'​ పసికందులు

author img

By

Published : Aug 21, 2021, 12:44 PM IST

troops-helping-afghan-children
అఫ్గాన్‌ పసికందులను లాలిస్తున్న విదేశీ సైనికులు

తాలిబన్ల ఆక్రమణలతో అఫ్గానిస్థాన్‌లో (Afghanistan Taliban) కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ముష్కరుల అరాచక పాలన ఎరిగిన అఫ్గాన్‌ వాసులు ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. కనీసం తమ పిల్లలనైనా కాపాడాలంటూ విదేశీ దళాలను వేడుకుంటున్నారు. ఆ తల్లుల వేదన భద్రతా దళాల మనసును కరిగించింది. అందుకే ఆ చిన్నారులను అక్కున చేర్చుకుని లాలించారు.

ఓవైపు కన్నపేగు మమకారం.. మరోవైపు తాలిబన్ల చెర (Afghanistan Taliban) నుంచి తమ కంటిపాపలను కాపాడుకోవాలనే ఆరాటం.. వెరసి ఆ తల్లులు తమ గుండెను రాయి చేసుకున్నారు. మనసులో మెలిపెడుతున్న రంపపు కోతను పంటి బిగువున పట్టి కన్నబిడ్డలను పరాయి దేశానికి పంపించేందుకు సిద్ధమయ్యారు. కనీసం తమ పిల్లలనైనా కాపాడాలంటూ విదేశీ దళాలను వేడుకుంటున్నారు. ఆ తల్లుల వేదన భద్రతా దళాల మనసును కరిగించింది. అందుకే ఆ చిన్నారులను అక్కున చేర్చుకుని లాలించారు. కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Kabul airport) ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు కోకొల్లలు..!

troops-helping-afghan-children
చిన్నారులను లాలిస్తున్న విదేశీ మహిళా సైనికులు
troops-helping-afghan-children
పసికందును ఆడిస్తున్న ఓ సైనికుడు
troops-helping-afghan-children
పసికందును లాలిస్తున్న సైనికుడు

తాలిబన్ల ఆక్రమణలతో అఫ్గానిస్థాన్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ముష్కరుల అరాచక పాలన (Afghanistan Taliban) ఎరిగిన అఫ్గాన్‌ వాసులు ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. అయితే తాలిబన్లు వారిని అడ్డుకుని ఎయిర్‌పోర్టుకు వెళ్లకుండా ఇనుప కంచెలు అడ్డుపెట్టారు. దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు.. కనీసం తమ తర్వాతి తరాన్నైనా తాలిబన్ల నుంచి కాపాడుకోవాలని ఆరాపడుతున్నారు. ఇనుప కంచెల పైనుంచే తమ పిల్లలను ఎయిర్‌పోర్టులో ఉన్న అమెరికా, బ్రిటన్‌ దళాలకు అప్పగిస్తున్నారు. ఆ చిన్నారులను విదేశీ బలగాలు కూడా అక్కున చేర్చుకుంటున్నాయి.

troops-helping-afghan-children
చిన్నారి దాహం తీర్చుతున్న జవాను

విదేశీ భద్రతా సిబ్బంది ఆ శిశువులను ఎత్తుకుని లాలిస్తున్నారు. కుటుంబాలకు దూరంగా కల్లోల ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఆ సైనికులు.. ఈ పసిపాపల బోసినవ్వులు చూడగానే తమ బిడ్డలను గుర్తుచేసుకుంటున్నారు. అఫ్గాన్‌ వాసుల పిల్లలను సైనికులు ఎత్తుకుని ఆడిస్తున్న చిత్రాలు, వారికి సాయం చేస్తున్న దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి.

troops-helping-afghan-children
జవానుతో అఫ్గాన్​ చిన్నారి

కల్లోలంలో కరుణచూపి..

కాబుల్ విమానాశ్రయంలో ఓ పసికందును ఇనుప కంచెపై నుంచి సైనికులు తీసుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా దేశం విడిచి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అయితే లోపలికి అనుమతి లేకపోవడంతో గేటు వద్ద నిరీక్షించారు. ఆ సమయంలో చిన్నారి అనారోగ్యానికి గురవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అమెరికా దళాల సాయం కోరారు. వెంటనే స్పందించిన యూఎస్‌ భద్రతా సిబ్బంది ఆ చిన్నారిని కంచెపై నుంచి తీసుకుని ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారికి చికిత్స అందించిన అనంతరం ఆ శిశువును తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కల్లోల పరిస్థితుల్లోనూ ఆ భద్రతాసిబ్బంది మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ శిశువుకు సాయం చేసిన తీరు ప్రశంసనీయమే..!

troops-helping-afghan-children
పిల్లలకు వాటర్​ బాటిళ్లు అందిస్తున్న జవాన్లు
troops-helping-afghan-children
చిన్నారులతో జవాన్​ సరదాగా

ఇవీ చూడండి: Afghan Crisis: అఫ్గాన్​లో ఆ రోజు ఏం జరుగుతుంది?

Afghan Crisis: మైనారిటీలపై తాలిబన్ల ఊచకోత

Afghan Crisis: అమెరికా ఖర్చు ఘనం- ఫలితం మాత్రం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.