ETV Bharat / international

ఫుట్​బాల్​ మైదానంలో పేలుడు- 14 మందికి గాయాలు

author img

By

Published : Apr 14, 2021, 8:31 AM IST

బలూచిస్థాన్​లో ఫుట్​బాల్ మ్యాచ్​ జరుగుతున్న క్రమంలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.

blast
పేలుడు ఘటన

పాకిస్థాన్​, బలూచిస్థాన్​లో ఓ ఫుట్​బాల్​ మైదానంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మ్యాచ్​ జరుగుతున్న సమయంలో పేలుడు జరిగిన క్రమంలో ప్రేక్షకులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

అయితే.. ఫుట్​బాల్​ ఆటగాళ్లెవరికి ప్రమాదం జరగలేదని, కోర్టు గోడ పక్కన పేలుడు జరగటం వల్ల ప్రేక్షకులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: బస్సు, ట్రక్కు ఢీ-20 మంది మృతి

:పాఠశాలలో కాల్పుల కలకలం - ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.