ETV Bharat / international

బుల్లి ఫ్లాట్​ ధర రూ.6కోట్లు.. అయినా భారీ డిమాండ్​

author img

By

Published : Nov 15, 2021, 12:38 PM IST

హాంకాంగ్​లో(hong kong news) 128 చదరపు అడుగుల ఫ్లాట్​కు ఏకంగా రూ.6కోట్లు ధర పలుకుతోంది. 1,106 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం గల ఈ దేశంలో కేవలం 7% భూభాగాన్ని నివాసప్రాంతంగా కాగా.. మిగతా భూభాగాన్ని కొండలకు, ప్రకృతి ఆవాసాలకు, పార్కులకు విడిచిపెట్టారు. అందుకే సొంతిల్లు కోసం జనం ఎన్ని రూ.కోట్లు ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు.

hongkong FLAT  price
బుల్లి ఫ్లాట్​ ధర రూ.6కోట్లు.. అయినా భారీ డిమాండ్​

ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత గల దేశాల్లో హాంకాంగ్ ఒకటి(hong kong news). అక్కడ 7 శాతం భూభాగమే నివాసప్రాంతం. అందుకే ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటుతాయి. చిన్న ఇంటిని సొంతం చేసుకోవాలంటే రూ.6 కోట్ల వరకు గుమ్మరించాల్సిందే. అయినా అక్కడ ఇళ్లకు విపరీత డిమాండ్ ఉంటుంది. 220 చదరపు అడుగుల ఇల్లు అనగానే... 'వావ్‌! ఇంత విశాలమైన ఇల్లా' అని హాట్‌ కేకుల్లా కొనేసుకుంటారు. ఎందుకంటే హాంకాంగ్​లో 128 చదరపు అడుగుల (14.22 చదరపు గజాల) ఫ్లాట్లు కోకొల్లలు.

హాంకాంగ్​ విస్తీర్ణం 1,106 చదరపు కిలోమీటర్లు(hong kong news latest). ఇందులో కేవలం 7% భూభాగాన్ని నివాసప్రాంతంగా కాగా... మిగతా భూభాగాన్ని కొండలకు, ప్రకృతి ఆవాసాలకు, పార్కులకు విడిచిపెట్టారు. ఇక ఇక్కడి ప్రస్తుత జనాభా సుమారు 75 లక్షలు. ఒక్క చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో 49 వేల మంది నివసిస్తున్నారు(hong kong population). తక్కువ స్థలంలో నివసించే జీవనశైలికి 1960ల్లోనే ఇక్కడ బీజం పడింది. జనాభా పెరుగుతుండటంతో, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యను ముందే ఊహించిన అప్పటి హాంకాంగ్‌ గవర్నర్‌ లార్డ్‌ మాక్‌లెహోస్‌...

75% భూభాగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నివాసేతర ప్రాంతంగానే ఉంచాలని నిర్ణయించారు. దీంతో ఎక్కడికక్కడ ఆకాశహర్మ్యాలు వెలిశాయి. కారు నిలపడానికి అవసరమైన దానికంటే తక్కువ స్థలంలో సొంత ఫ్లాట్‌ దొరికితే చాలు... మహద్భాగ్యమే ఇక్కడ!

సూక్ష్మ గృహోద్యమంతో...

'నీకు సొంతిల్లు లేదంటే... అది నీ సమస్యే' అన్న భావన హాంకాంగ్‌లో అత్యంత బలంగా ఉంది(hong kong home). దీంతో కనీసం ఒక్క ఫ్లాట్‌ అయినా కొనుక్కోవాలన్న లక్ష్యం అందరిలోనూ కనిపిస్తుంది. ఈ డిమాండుకు తగ్గట్టు సూక్ష్మ గృహోద్యమం పుట్టుకొచ్చి... 128, 168, 220 తదితర చదరపు అడుగుల నానోఫ్లాట్లతో కూడిన టవర్ల నిర్మాణం ఊపందుకొంది. కరోనాకు ముందు 2019లో ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతున్నప్పుడు... ఇలాంటి సుమారు 8,500 ఫ్లాట్లు చటుక్కున అమ్ముడుపోయాయి.

లోపల ఏమేం ఉంటాయి?

సగటు ఇంటి విస్తీర్ణంతో పోలిస్తే, దానికి సగం స్థలంలో నిర్మించిన ఇళ్లను మైక్రోఫ్లాట్స్‌ అంటారు(hong kong micro flats). ఇవి సుమారు 290 చదరపు అడుగుల్లో ఉంటాయి. అంతకంటే తక్కువ విస్తీర్ణం ఉండేవాటిని నానోఫ్లాట్స్‌ అంటారు. ఆధునిక వసతులతో వీటిని అత్యంత సౌకర్యవంతంగా నిర్మిస్తారు. అక్కడికక్కడే ఒక మంచం, అర, మరుగుదొడ్డి, కిచెన్‌ ఉంటాయి. బాత్రూంలో కుండీపైనే స్నానం చేయడానికి అవసరమైన షవర్‌ను అమర్చేస్తారు. కిచెన్‌లో ఇన్‌బిల్ట్‌గా మైక్రోవోవెన్‌ ఉంటుంది.

కనిపించని అసంతృప్తి...

మైక్రో, నానో ఇళ్ల నిర్మాణానికి అనుగుణంగా హాంకాంగ్‌ సర్కారు కూడా గృహనిర్మాణ నిబంధనలను ఎప్పటికప్పుడు సడలిస్తూ వస్తోంది(hong kong housing problem). జనాభాలో దాదాపు సగం మందికి సొంత మైక్రో, నానోఫ్లాట్లు ఉన్నాయి. అద్దెకు ఇచ్చేందుకు మాత్రం 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లను నిర్మిస్తుంటారు. ఇలాంటి వాటిలో వేల మంది జీవనం సాగిస్తున్నారు. మిగతా దేశాలవారితో పోల్చితే తాము అత్యంత చిన్న గదుల్లో జీవిస్తున్నామన్న అసంతృప్తి ఇక్కడివారిలో అంతగా కనిపించడంలేదు. పైగా, కుటుంబం పెద్దదయ్యేకొద్దీ పెద్ద ఇళ్లలోకి వెళ్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు!

కోట్లు గుమ్మరించాల్సిందే

  • హాంకాంగ్‌లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఉంది(hong kong flat price). 128 నుంచి 288 చదరపు అడుగుల ఫ్లాట్ల ఖరీదు... సుమారు రూ.6 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకూ ఉంటున్నాయి.
  • 2010 నుంచి ఇక్కడ సొంతిళ్లకు గిరాకీ బాగా పెరిగింది. దీంతో 2019 నాటికి ఫ్లాట్ల ధరలు ఏకంగా 187% మేర ఎగబాకాయి.
  • గంటకు రూ.360 (4.82 డాలర్లు) కనీస సంపాదన ఉండే నగరంలో సగటు ఇంటి ఖరీదు రూ.9.66 కోట్లు (1.3 మిలియన్‌ డాలర్లు).
  • ఆ లెక్కన అత్యంత నిపుణుడైన ఉద్యోగి 650 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇంటిని సొంతం చేసుకోవడానికి... కనీసం 21 సంవత్సరాలు పనిచేయాల్సిందేనని ఓ అధ్యయనం వెల్లడించింది.

ఇదీ చదవండి: Taliban News: 'భారత్​తో సత్సంబంధాలే కోరుకుంటున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.