ETV Bharat / international

నేపాల్​లో 122 మంది చైనీస్​ సైబర్​ నేరగాళ్లు అరెస్ట్​

author img

By

Published : Dec 24, 2019, 6:49 PM IST

నేపాల్​లో సైబర్​ నేరాలకు పాల్పడిన 122 మంది చైనీయులను అదుపులోకి తీసుకున్నట్లు నిర్ధరించింది చైనా. తమ భద్రతా అధికారుల సాయంతో నేపాల్​ పోలీసులు వీరిని పట్టుకున్నట్లు డ్రాగన్​ దేశం తెలిపింది.

china-nepal
122మంది చైనీస్​ సైబర్​ నేరాగాళ్లు అరెస్టు

నేపాల్​లో సైబర్​ నేరాలకు పాల్పడిన 122 మంది చైనీయులను అదుపులోకి తీసుకున్నది నిజమేనని చైనా ఒప్పుకుంది. నేరగాళ్లను చైనా భద్రత అధికారుల భాగస్వామ్యంతో నేపాల్​ పోలీసులు పట్టుకున్నట్లు తెలిపింది.

కాఠ్మాండు సరిహద్దులోని పలు ఇళ్లుపై సోదా చేసి...500కు పైగా ల్యాప్​టాప్స్​ను స్వాధీనం చేసుకున్నారు నేపాల్​ పోలీసులు. బ్యాంకు నగదు లావాదేవీలు జరిపే యంత్రాలను హ్యాక్​ చేసి ఆర్థిక నేరాలకు పాల్పుడుతున్నట్లుగా పోలీస్​ అధికారులు తెలిపారు.

చైనా- నేపాల్​ సంయుక్తంగా ఈ ఆపరేషన్​ చేపట్టినట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెంగ్​ సుయాంగ్​ మీడియాకు వెల్లడించారు.

"సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతలు, సైబర్​ నేరాలు అదుపు చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయి."

-జెంగ్​ శుయాంగ్​, చైనా విదేశాంగ్ శాఖ ప్రతినిధి.

గత నెల సెప్టెంబరులో కాఠ్మాండు​లో ఐదుగురు చైనీయులు అక్రమంగా క్లోన్​ డెబిట్​ కార్డుల ద్వారా లక్షల్లో నగదును ఉపసంహరించుకున్నందుకు అరెస్టు అయ్యారు. వారి దగ్గర నుంచి 132 ఫోర్జరి వీసా డెబిట్​ కార్డులు, 17 అథెంటిక్​ వీసా కార్టులు, 6 మోబైల్​ ఫోన్లు, ఓ డేటా కార్డు, ల్యాప్​టాప్​ను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి : సీడీఎస్​, ఎన్​పీఆర్​కు కేంద్ర కేబినెట్​ పచ్చజెండా

New Delhi, Dec 24 (ANI): Indian Army officer, Major Anoop Mishra, has developed a bulletproof jacket with full body protection for the jawans. The jacket can withstand even sniper rifle bullets from 10m distance. Mishra was also hit by a bullet on his jacket during deployment in Jammu and Kashmir. While speaking to ANI, Major Anoop Mishra said, "During one operation, I was hit by a stray bullet on my bullet proof jacket, although the bullet didn't penetrate but it caused a trauma." "So I decided to make my own bullet proof jacket. This jacket can withstand a sniper bullet from even 10 meters," he added.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.