ETV Bharat / international

కరోనా ధాటికి అమెరికా విలవిల.. ఫ్రాన్స్​లో 3లక్షల కొత్త కేసులు

author img

By

Published : Jan 6, 2022, 9:36 AM IST

Corona cases
కరోనా కేసులు

worldwide covid cases: అమెరికాలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం మరో 7 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. 1800 మంది మరణించారు. ఫ్రాన్స్​లో కొవిడ్​ ఉగ్రరూపం దాల్చుతోంది. రికార్డుస్థాయిలో 3.32లక్షల కేసులు వెలుగుచూశాయి. బ్రిటన్​, ఇటలీలో కొత్త కేసులు రెండు లక్షలకు చేరువయ్యాయి. స్పెయిన్​, అర్జెంటీనా, టర్కీల్లోనూ వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

worldwide covid cases: కొవిడ్​ వైరస్​.. డెల్టా, ఒమిక్రాన్​ వేరియంట్ల ఉద్ధృతితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. లక్షల మంది వైరస్​ బారినపడుతున్నారు. అమెరికాలో ఒమిక్రాన్​ రకం విజృంభణతో పరిస్థితి తీవ్రంగా మారింది. బుధవారం ఒక్కరోజే.. 7,04,661 మందికి కరోనా మహమ్మారి సోకింది. వైరస్​ ధాటికి 1,802 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8,53,612 చేరింది. ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం వల్ల.. వైద్య శాఖపై తీవ్ర ప్రభావం పడుతోంది.

దేశంలోనే మూడో పెద్ద జిల్లా చికాగోలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. చికాగో పాఠశాలను మూసివేశారు. వైరస్​ ఉద్ధృతి నేపథ్యంలో భౌతిక తరగతులకు నిరాకరించారు ఉపాధ్యాయులు, యూనియన్​ నాయకులు.

మియామీ నుంచి 11 రోజుల సముద్ర ప్రయాణానికి బయలుదేరిన నౌకను రెండు రోజుల్లోనే వెనక్కి మళ్లించారు. షిప్పులోని పదుల సంఖ్యలో సిబ్బందికి వైరస్​ సోకటమే ఇందుకు కారణం. దీంతో వందలాది మంది ప్రయాణికులు నిరుత్సాహపడాల్సి వచ్చింది. బుధవారం బయలుదేరాల్సిన మరో నౌకను సైతం రద్దు చేశారు. మొత్తంగా 8నౌకలను నిలిపివేసినట్లు నార్వేయిన్​ క్రూయిజ్​ లైన్​ పేర్కొంది.

ఫ్రాన్స్​లో ఒక్కరోజే 3.32 లక్షల కేసులు

France covid cases: ఐరోపా దేశాల్లో వైరస్​ ఉగ్రరూపం దాల్చింది. ఫ్రాన్స్​లో బుధవారం ఒక్కరోజే 3,32,252 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా 246 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,24,809కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 1.09కోట్లు దాటింది. 60,515 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ఒమిక్రాన్​ వేరియంట్​ ఉద్ధృతే కొత్త కేసులకు కారణంగా అధికారులు పేర్కొంటున్నారు.

వైరస్​ ఉద్ధృతో ఏర్పడిన వైద్య సిబ్బంది కొరతను తగ్గించేందుకు ఫ్రాన్స్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్​ బారినపడి ఎలాంటి లక్షణాలు లేని వైద్య సిబ్బంది.. స్వీయ నిర్బంధంలోకి వెల్లటానికి బదులుగా.. విధుల్లో కొనసాగేందుకు అనుమతించింది. ఈ మేరకు ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది.

ప్రపంచవ్యాప్తంగా వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉన్న దేశాలు..

  • UK covid cases: బ్రిటన్​లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 1,94,747కేసులు నమోదయ్యాయి. 343 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు.
  • Italy Covid cases: ఇటలీలో1,89,109 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 183 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 6,756,035కు పెరిగింది. మరణాల సంఖ్య 1,38,276కు చేరుకుంది.
  • Spain corona cases: స్పెయిన్​లో వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. బుధవారం ఒక్కరోజే 1,37,180 మందికి వైరస్​ సోకింది. 148మంది వైరస్​కు బలయ్యారు. 10,836వేల మంది కోలుకున్నారు.
  • Argentina Covid cases: అర్జెంటీనాలో బుధవారం ఒక్కరోజే 95,159మందికి కొత్తగా వైరస్​ పాజిటివ్​గా తేలింది. 52 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. 20,088మంది వైరస్​ నుంచి కోలుకోగా.. మొత్తం కేసుల సంఖ్య 59,15,695కు చేరింది.
  • Turkey Corona cases: టర్కీలో కొత్తగా 66,467 కేసులు నమోదు అయ్యాయి. 143 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: ఫ్రాన్స్​లో కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే డేంజర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.