ETV Bharat / international

సామాన్యుని రథం 'సైకిల్'తో ఇన్ని లాభాలా?

author img

By

Published : Jun 3, 2020, 6:22 AM IST

Updated : Jun 3, 2020, 11:08 AM IST

సైకిల్​... సామాన్యుల ప్రయాణంలో కీలక పాత్రధారి. ఒక సాధారణ, చౌకైన, సులభతర ప్రయాణ వాహనం. మొత్తంగా బహుళ ప్రయోజనకారి. పురాతన కాలంలో పనులను వేగవంతం, సులభతరం చేయడంలో దీని పాత్ర అమోఘం. క్రమక్రమంగా మరెన్ని సదుపాయాలు, సౌకర్యాలు సమకూరినా.. సైకిల్​ వాడకం నిత్యనూతనమే. దాని అవసరం, ప్రయోజనం ఇప్పటికీ ఉంది. జూన్​ 3న ప్రపంచ సైకిల్​ దినోత్సవం సందర్భంగా సైకిల్​ విశేషాలు మీకోసం...

World Bicycle Day is being celebrated on  3 June.
సామాన్యుని రథం 'సైకిల్'​ చరిత్ర ఘనం

జూన్​ 3న ప్రపంచ సైకిల్​ దినోత్సవాన్ని జరుపుకుంటారని మీకు తెలుసా? మొట్టమొదటి సారిగా 2018 జూన్​ 3న (ఆదివారం) ఐక్యరాజ్యసమితి.. న్యూయార్క్​లోని ఐరాస జనరల్​ అసెంబ్లీ వేదికగా ఈ సైకిల్​ డేని నిర్వహించింది.

ఎందుకు నిర్వహించాలి..?

సైకిల్ వాడకంతో కలిగే లాభాలపై ప్రచారం చేయడమే ఈ దినోత్స‌వం ముఖ్య ఉద్దేశం. నడక, సైక్లింగ్​ సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) నివేదించింది. ఇంకా సైకిల్​ వాడకంతో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్​ వచ్చే అవకాశాలు తక్కువ. మొత్తంగా ఆయుష్షు పెంచుకోవచ్చట.

World Bicycle Day is being celebrated on  3 June.
సంపూర్ణ ఆరోగ్యానికి సైకిల్​

ప్రాముఖ్యం, లక్ష్యాలు...

రహదారి భద్రతను మెరుగుపరచడానికి సభ్యదేశాలను ప్రోత్సహించ‌ట‌మే కాక‌, పాదచారుల భద్రతను కాపాడటానికి సైకిల్ వాడ‌కాన్ని ప్రోత్సహిస్తోంది ఐరాస.

జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడం, సైక్లింగ్​ సంస్కృతిని మరోస్థాయికి తీసుకెళ్లేలా కొత్త కొత్త విధానాలు, ఉత్తమ పద్ధతులతో ముందుకొచ్చేలా ఐరాస.. సభ్యదేశాల్ని ప్రోత్సహిస్తోంది.

సైకిల్​ వల్ల ప్రయోజనాలు...

సైకిల్​ తొక్కితే శారీరక ఉత్సాహంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది. మోటారు వాహనాలు వినియోగించిన వాళ్ల జీవిత కాలం.. 60-70 ఏళ్లు కాగా.. సైకిల్​ తొక్కేవారు 80-90 ఏళ్ల వరకు జీవించే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.

World Bicycle Day is being celebrated on  3 June.
సైకిల్​డే ఎందుకు..?
  • సైకిల్ సరళమైన, సరసమైన, నమ్మదగిన, పర్యావరణ అనుకూల రవాణా మార్గంగా చెప్పవచ్చు. సైకిల్.. అభివృద్ధికి ఒక సాధనంగా, విద్య, ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది.
  • శారీరకంగా దృఢంగా ఉండేందుకు, వ్యాధుల బారి నుంచి రక్షణకు.. సైకిల్​ తొక్కడం మంచిదట.
  • సైకిల్... రవాణాకు ఉప‌యోగక‌ర‌మే కాకుండా, ఇంధన ఆదాకు ఉప‌యుక్త‌మైన‌ది.
  • ఇంధన వనరుల దిగుమతి తగ్గించుకొని.. ఆర్థిక భారం నుంచి విముక్తి పొందవచ్చు.
    World Bicycle Day is being celebrated on  3 June.
    సైకిల్​తో ప్రయోజనాలెన్నో!

శారీరక ప్రయోజనాలు...

  • గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తక్కువ.
  • మధుమేహం దూరం.
  • కంటి నిండా నిద్ర ఉంటుంది.
  • కళ్లు, మెదడు చురుగ్గా పనిచేస్తాయి.
  • బరువు తగ్గొచ్చు.
  • లైంగిక ఆరోగ్యానికి మంచిది.
  • ఎముకల్లో పటుత్వం వస్తుంది.
  • కండరాలు దృఢత్వం సంతరించుకుంటాయి.
Last Updated : Jun 3, 2020, 11:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.