ETV Bharat / international

అధికార బదిలీ ప్రక్రియలో మరో ముందడుగు

author img

By

Published : Nov 25, 2020, 12:23 PM IST

White House authorises President's daily Briefing for Biden
అధికార బదిలీలో మరో ముందడుగు

అమెరికా ఎన్నికల్లో విజేతగా నిలిచిన జో బైడెన్​కు అధికార బదిలీ ప్రక్రియలో మరో ముందడుగు పడింది. అధ్యక్షుడి రోజువారీ కార్యకలాపాల వివరాలను పొందేందుకు బైడెన్​కు అనుమతిస్తూ శ్వేతసౌధం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎప్పటి నుంచి ఈ వివరాలను ఇస్తారనే విషయంపై స్పష్టత లేదు.

అధ్యక్షుడి రోజువారీ కార్యకలాపాల వివరాలను పొందేందుకు జో బైడెన్​కు శ్వేతసౌధం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

అధ్యక్షుడికి ఉన్న ముప్పు, రక్షణ సంబంధిత విషయాలతో జాతీయ భద్రతా సంఘం ఈ వివరాలను పొందుపరుస్తుంది. ఎప్పటి నుంచి ఈ వివరాలు బైడెన్​కు అందిస్తారన్న విషయంపై స్పష్టత లేదు. అయితే అధికార బదిలీలో ఇది మరో ముందడుగని సీఎన్​ఎన్ వార్తా సంస్థ అభిప్రాయపడింది.

ఈ రహస్య సమాచారం అధ్యక్షుడితో పాటు భద్రతా సలహాదారులు, శ్వేతసౌధ ఉన్నతాధికారులు, నిఘా వర్గాలకు అందుబాటులో ఉంటుంది. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో అధ్యక్షుడు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన వివరాలు ఇందులో ఉంటాయి.

బదిలీ ప్రక్రియను చేపట్టాలని జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్(జీఎస్​ఏ)కు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజా ప్రకటన రావడం గమనార్హం.

ఇదీ చదవండి- బిన్​ లాడెన్​ ఎక్కడ దొరికాడో మరిచిపోయారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.