ETV Bharat / international

వాలంటైన్స్​ ప్రత్యేకం: బహుమతులపై భారీ తగ్గింపు

author img

By

Published : Feb 14, 2020, 7:18 AM IST

Updated : Mar 1, 2020, 6:58 AM IST

ప్రేమికుల దినోత్సవానికి గుర్తుగా.. వారు ప్రేమించేవారి కోసం ఏదైనా బహుమతినివ్వాలని కోరుకుంటారు. అది ఎల్లకాలం గుర్తుండాలని ఆకాంక్షిస్తూ తీపి జ్ఞాపకంగా ఉంచుకోవాలని భావిస్తారు. అలాంటి వారికోసం ప్రత్యేకమైన గిఫ్ట్​ గ్యాలరీని ఏర్పాటు చేసిన కాలిఫోర్నియా వ్యాపారులు.. సగం ధరలకే విక్రయిస్తున్నారు.

Valentines Day gifts on offer in California this year
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కాలిఫోర్నియాలో బహుమతులపై భారీ తగ్గింపు

వాలంటైన్స్​ ప్రత్యేకం: బహుమతులపై భారీ తగ్గింపు

వాలంటైన్స్​ డే.. ప్రేమికులకు ప్రత్యేకమైన రోజు. తాను ప్రేమించే వ్యక్తికి ఏదో బహుమతి ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ విషయాన్ని లాభాల అర్జనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కాలిఫోర్నియా వ్యాపారులు. బహుమతులపై భారీ డిస్కౌంట్లతో యువతను ఆకర్షిస్తున్నారు.

ఇందుకోసం ప్రత్యేకంగా గిఫ్ట్ గ్యాలరీని ఏర్పాటు చేశారు. పట్టు వస్త్రాలతో సహా దాదాపు 75 ప్రత్యేక వస్తువులను భారీ తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా సౌందర్య సాధనాలపై ఎక్కువగా దృష్టి సారించారు. తద్వారా అధిక కొనుగోళ్ల ద్వారా లాభాలు అర్జించవచ్చని జాతీయ చిల్లర వర్తకుల సంఘం పేర్కొంది.

"ప్రేమికులరోజు సందర్భంగా... బహుమతులు కొనేవారికి కచ్చితంగా అద్భుతమైన ఆఫరే! బహుమతులు కొనేవారికోసం మేము ఎదురుచూస్తున్నాం. చూపరులను ఆకట్టుకునేలా కొన్ని రకాల వస్తువులను జతచేశాం. కొన్నింటికీ అధిక మొత్తాన్ని వెచ్చించాల్సివచ్చినా.. కచ్చితంగా ఎక్కువమంది కొనుగోలు చేస్తారు. తద్వారా మేము తప్పకుండా విజయవంతమవుతాం."

- నికోలా కాగ్​లియాటా, కమిటీ అధ్యక్షుడు

చిరకాలం గుర్తుండేలా...

ఎప్పటిలాగే సంప్రదాయబద్ధమైన వస్తువులను తయారుచేశామన్న నికోలా... ఈ సారి మాత్రం మహిళలను మరింతగా ఆకర్షిస్తాయన్నారు. తోలు​ వస్తువులు కూడా సగం కంటే తక్కువ ధరలకే లభిస్తాయని తెలిపారు.

పెంపుడు జంతువుల కోసం కూడా ప్రత్యేకంగా కొన్ని వస్తువుల్ని విక్రయిస్తున్నారు. కేవలం వీటికోసమే ఏకంగా 71.7 బిలియన్​ డాలర్లు వెచ్చిస్తారని 'నేషనల్​ రిటైల్​ ఫెడరేషన్ సర్వే' అంచనా వేసింది.

ఇదీ చదవండి: భాజపా ఆందోళనలను సమర్థిస్తున్నా: రాహుల్ గాంధీ

Last Updated : Mar 1, 2020, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.