ETV Bharat / international

సోమవారం సెనేట్​ ముందుకు ట్రంప్​ అభిశంసన

author img

By

Published : Jan 22, 2021, 10:50 PM IST

Schumer: House to send Trump impeachment article Monday
'సోమవారమే సెనేట్​కు ట్రంప్​ అభిశంసన దస్త్రం!'

అమెరికాలోని క్యాపిటల్​ భవనంపై దాడికి సంబంధించి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై డెమొక్రాట్లు సంధించిన అభిశంసన అస్త్రం సోమవారం.. సెనేట్​ ముందుకు వెళ్లనుంది. ఈ మేరకు చర్యలు చేపట్టేందుకు ప్రతినిధుల సభ స్పీకర్​ పెలోసీ ప్రణాళికలు రచిస్తున్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అభిశంసన వచ్చే సోమవారం సెనేట్​కు చేరుకోనుంది. ప్రతినిధుల సభలో గత వారం గట్టెక్కిన అభిశంసనను స్పీకర్​ నాన్సీ పెలోసీ సెనేట్​కు పంపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెనేట్​లో పూర్తిస్థాయిలో విచారణ ఉంటుందని మెజారిటీ నేత చక్​ షుమర్​ స్పష్టం చేశారు.

ఈ నెల 6న జరిగిన క్యాపిటల్​ హింసాకాండలో తన మద్దతుదారులను ట్రంప్​ ప్రేరేపించారన్న ఆరోపణలతో డెమొక్రాట్లు మాజీ అధ్యక్షుడిపై అభిశంసన అస్త్రాన్ని ప్రయోగించారు.

ఇదే జరిగితే.. సెనేట్​లో రెండుసార్లు అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడిగా ట్రంప్​ నిలుస్తారు. అదే సమయంలో పదవీ విరమణ అనంతరం విచారణను ఎదుర్కొన్న మొదటి అధ్యక్షుడిగానూ ట్రంప్​ పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్​ విజయాన్ని.. ఈ నెల 7న ఆ దేశ కాంగ్రెస్​ అధికారికంగా ధ్రువీకరించేందుకు సమావేశమైన క్రమంలో.. క్యాపిటల్​​ భవనంపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. ట్రంప్​ మద్దతుదారులు సృష్టించిన ఈ హింసకాండలో ఓ మహిళ మృతిచెందారు.

ఇదీ చదవండి: రణరంగంలా మారిన అమెరికా క్యాపిటల్​ భవనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.