ETV Bharat / international

ఇరాన్​పై మరోమారు అమెరికా ఆంక్షల వర్షం

author img

By

Published : Nov 19, 2020, 5:16 AM IST

ఇరాన్​కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థపై ఆంక్షలు విధించింది అమెరికా. ఇరాన్​ సుప్రీమో అయాతుల్లా తలపెట్టే హానికర చర్యలకు ఈ సంస్థ సహాయం చేస్తున్నట్టు ఆరోపించింది. మరోవైపు ఇరాన్​పై విధించిన ఆంక్షలను ఉపసంహరించుకుంటే ప్రమాదం తప్పదని పేర్కొన్నారు అమెరికా విదేశాంగమంత్రి పాంపియో.

US hits Iran with new sanctions as Pompeo defends strategy
ఇరాన్​పై మరోమారు అమెరికా ఆంక్షల వర్షం

ఇరాన్​పై మరోమారు ఆంక్షల వర్షం కురిపించింది అమెరికా. ఇరాన్​కు చెందిన 'మొస్తజఫన్​ ఫౌండేషన్​' అనే స్వచ్ఛంద సంస్థతో పాటు దానితో సంబంధం ఉన్న మరో 160 సంస్థలపై ఆంక్షలు విధించింది.

ఆయా సంస్థలు.. మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అగ్రరాజ్య ఖజానా, హోంశాఖ ఓ ప్రకటనను విడుదల చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్​ అయాతుల్లా అలీ ఖొమైనీ తలపెట్టే హానికర చర్యలకు ఈ సంస్థలు సహకారం అందిస్తున్నట్టు ఆరోపించాయి.

ఇరాన్​పై అమెరికా విధించిన తాజా ఆంక్షలను సమర్థించారు ఆ దేశ విదేశాంగమంత్రి మైక్​ పాంపియో. 'ది ఇంపార్టెన్స్​ ఆఫ్​ సాంక్షన్స్​ ఆన్​ ఇరాన్​' పేరుతో ఓ ప్రకటనను విడుదల చేశారు పాంపియో. ఆ దేశంపై ట్రంప్​ ప్రభుత్వం విధించిన ఆంక్షలతో ప్రపంచం మరింత సురక్షితంగా మారిందన్నారు. ఇలాంటి ఆంక్షలను ఉపసంహరించుకోవడం మూర్ఖమని, ప్రమాదకరమని హెచ్చరించారు.

ఇరాన్​తో సత్సంబంధాలు పెట్టుకోవాలనే యోచనలో అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​ యంత్రాంగం ఉన్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు పాంపియో.

ఇదీ చూడండి:- ఇరాన్​పై దాడి చేయాలని ట్రంప్​ ప్రమాదకర ఆలోచన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.