ETV Bharat / international

న్యూస్‌ ఛానెల్‌లో అశ్లీల వీడియో ప్రసారం..!

author img

By

Published : Oct 21, 2021, 8:31 PM IST

ఓ వార్తా ఛానెల్​లో ఇద్దరు యాంకర్లు వాతావరణ సమాచారాన్ని విశ్లేషిస్తున్న సమయంలో.. వీక్షకులు ఒక్కసారిగా షాక్​కు​ గురయ్యారు. ఆ ఛానెల్​లో అనుకోకుండా 13 సెకన్ల పాటు అశ్లీల వీడియో ప్రసారం కావడమే అందుకు కారణం. అమెరికాలోని వాషింగ్టన్​ నగరంలో ఈ ఘటన జరిగింది.

tv channel ais porn clip
న్యూస్‌ ఛానెల్‌లో అశ్లీల వీడియో

అమెరికాలోని వాషింగ్టన్‌ నగరం.. సాయంత్రం ఆరవుతోంది. ఓ స్థానిక వార్తా ఛానెల్‌లో ఇద్దరు యాంకర్లు నగర వాతావరణ సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. కొద్ది సేపటికే వీక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు! కారణం.. ఆ ఛానెల్‌లో అనుకోకుండా అశ్లీల వీడియో ఒకటి ప్రసారం కావడమే.

అమెరికాకు చెందిన టీవీ బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థ వార్తాసంస్థ 'క్రెమ్‌ 2'లో సాయంత్రం ఆరు గంటల బులెటిన్‌లో 13 సెకన్లపాటు ఈ వీడియో ప్రసారమైంది. గత ఆదివారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వాతావరణ నిపుణురాలు మిషెల్ బాస్ అప్‌డేట్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె వెనుక ఉన్న తెరపై అశ్లీల వీడియో ప్రారంభమైంది. అయితే.. ఆమె గానీ, ఆమె సహ యాంకర్ గానీ ఈ విషయాన్ని గుర్తించలేదు.

చివరకు తన తప్పును తెలుసుకున్న ఆ ఛానెల్.. రాత్రి 11 గంటల సమయంలో ఈ విషయమై క్షమాపణలు చెప్పింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా జాగ్రత్త వహిస్తామని పేర్కొంది. 'క్రెమ్‌ 2' మాతృ సంస్థ టీఈజీఎన్‌ఏ చీఫ్‌ కమ్యూనికేషన్‌ అధికారి అన్నే బెంట్లీ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా.. వీక్షకుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం వల్ల స్థానిక పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

వయసు ఏడాదే.. నెలకు రూ. 75 వేల సంపాదన

ఖరీదైన విదేశీ కానుకలను అమ్ముకున్న పాక్​ ప్రధాని..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.