ETV Bharat / international

ఆగని ట్రంప్ పోరాటం- సుప్రీంలో మరో వ్యాజ్యం

author img

By

Published : Dec 21, 2020, 10:49 AM IST

అగ్రరాజ్య ఎన్నికలకు సంబంధించి అమెరికా సుప్రీంకోర్టులో మరో వ్యాజ్యం దాఖలు చేశారు దేశాధ్యక్షుడు ట్రంప్​. పెన్సిల్వేనియాపై గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పులను వెనక్కి తీసుకోవాలని పిటిషన్​లో కోరారు. ఎలక్టోరళ్ల ఎంపికను ఆ రాష్ట్ర అసెంబ్లీకి అప్పగించాలన్నారు. అయితే ట్రంప్​ అభ్యర్థన మరోమారు తిరస్కరణకు గురయ్యే అవకాశాలే ఎక్కువ!

Trump wants Supreme Court to overturn Pa. election results
మరో వ్యాజ్యం దాఖలు చేసిన అధ్యక్షుడు ట్రంప్

జో బైడెన్​ను అధికారికంగా అమెరికా అధ్యక్షుడిగా ఎలక్టోరల్​ కాలేజీ ఎన్నుకున్నప్పటికీ.. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మాత్రం పట్టువీడటం లేదు. అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఇప్పటికీ వాదిస్తూనే ఉన్న ట్రంప్​ యంత్రాంగం.. తాజాగా అగ్రరాజ్య సుప్రీంకోర్టులో మరో వ్యాజ్యం దాఖలు చేసింది. పెన్సిల్వేనియాలోని మెయిల్​-ఇన్​ బ్యాలెట్లపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మార్చాలని ఈ తాజా వ్యాజ్యంలో కోరింది. ప్రజల నిర్ణయాన్ని తిరస్కరించి.. ఎలక్టోరళ్ల ఎంపిక బాధ్యతను ఆ రాష్ట్ర అసెంబ్లీకి అప్పగించాలని పేర్కొంది.

అయితే ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పులు ఇవ్వడం దాదాపు అసాధ్యం. అదే సమయంలో ఒక వేళ పెన్సిల్వేనియా ట్రంప్​కు దక్కినా.. అధ్యక్ష పీఠాన్ని పొందేందుకు సరిపడా గణాంకాలు బైడెన్​ వద్ద ఇంకా ఉంటాయి.

ఎలక్టోరల్​ కాలేజీ ఓట్లను లెక్కించేందుకు జనవరి 6న అమెరికా కాంగ్రెస్​ సమావేశం కానుంది. ఈలోపే చర్యలు చేపట్టాలని ట్రంప్​ అటార్నీ రూడీ గియులియాని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే ఇది కూడా జరిగే పనిలా కనిపించడం లేదు. ఈ కేసు విచారణ జనవరి 8న జరిగే అవకాశముంది.

కోర్టుల్లో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా.. ట్రంప్​ మాత్రం వెనకడుగు వేయడం లేదు. తన వ్యాజ్యాలు తిరస్కరణకు గురవుతున్నా.. మళ్లీ కొత్తవి వేస్తూనే ఉన్నారు. ఇలా ట్రంప్.. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ..​ ఇప్పటివరకు 50కుపైగా పిటిషన్లు వేశారు.

ఇదీ చూడండి : 'ట్రంప్ న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.