ETV Bharat / international

కణాల్లోకి చొచ్చుకెళ్లకుండా కరోనా వైరస్​కు అడ్డుకట్ట!

author img

By

Published : Oct 14, 2021, 4:31 AM IST

covid
కణాల్లోకి చొచ్చుకెళ్లకుండా కరోనా వైరస్​కు అడ్డుకట్ట!

కరోనా వైరస్​ను అడ్డుకునే సరికొత్త పదార్థాన్ని అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. దీనితో యాంటీవైరల్​ ఔషధాన్ని రూపొందిస్తే.. కొవిడ్​ బాధితుల్లో ఇన్​ఫెక్షన్​ తీవ్రత పెరగదని, మరణముప్పు దూరమవుతుందని పరిశోధకులు వెల్లడించారు.

మానవ కణాల్లోకి ప్రవేశించకుండా కరోనా వైరస్​ను అడ్డుకునే సరికొత్త పదార్థాన్ని వాషింగ్టన్​ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని పేరు 'ఎంఎం 3122'. మనిషి జీవకణాల్లోకి చొచ్చుకెళ్లేలా వైరస్​ను అనుమతిస్తున్న ట్రాన్స్​మెంబ్రేన్​ సెరైన్​​ ప్రొటీన్-2 అనే మాంసకృత్తును ఈ కొత్త పదార్థం సమర్థంగా అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనితో యాంటీవైరల్​ ఔషధాన్ని రూపొందిస్తే.. కొవిడ్​ బాధితుల్లో ఇన్​ఫెక్షన్​ తీవ్రత పెరగదని, మరణముప్పు దూరమవుతుందని పరిశోధనకర్త జేమ్స్​ జనెట్కా చెప్పారు.

"కొవిడ్​ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా, కరోనా ముప్పు తప్పడం లేదు. మహమ్మారి నుంచి బాధితులను రక్షించేందుకు సరైన ఔషధాలను అందించాల్సి ఉంది. ఆ దిశగా పరిశోధన సాగించి, కొత్త రసాయన పదార్థాన్ని తయారుచేశాం. ఊపిరితిత్తులపై ఉండే ట్రాన్స్​మెంబ్రేన్​ సెరైన్ ప్రొటీన్-2, మట్రిప్టాస్​ ప్రొటీన్లు కరోనా వైరస్​ను ఆహ్వానించి, మానవ కణాలు ఇన్​ఫెక్షన్​కు గురయ్యేందుకు అడ్డుకుని, ఇన్​ఫెక్షన్​ను విస్తరించనివ్వదు" అని జేమ్స్​ తెలిపారు. ఈ పరిశోధన వివరాలను ప్రొసీడింగ్స్​ ఆఫ్​ నేషనల్​ అకాడమీ ఆఫ్​ సైన్సెస్​ పత్రిక అందించింది.

ఇదీ చూడండి : 'అఫ్గాన్ నుంచి ఏం కోరుకుంటున్నామో అప్పుడే చెప్పాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.