ఆ మహిళా ఉద్యోగితో బిల్​ గేట్స్​ అలా..!

author img

By

Published : Oct 19, 2021, 9:03 AM IST

Updated : Oct 19, 2021, 10:59 AM IST

Bill Gates

మైక్రోసాఫ్ట్​ వ్యస్థాపకుడు.. సంస్థలోని ఓ మహిళా ఉద్యోగిని ఫ్లర్ట్​ చేసేవారని వాల్ ​స్ట్రీట్​ జర్నల్​ వార్తాపత్రిక ఓ కథనం ప్రచురించింది. ఫ్లర్టింగ్​తో కూడిన ఈమెయిల్స్​ను ఆమెకు పంపేవారని పేర్కొంది. దీనిపై గేట్స్​కు సంస్థ వార్నింగ్​ కూడా ఇచ్చినట్టు వెల్లడించింది. దీనిపై స్పందించేందుకు మైక్రోసాఫ్ట నిరాకరించినా.. పత్రిక ప్రచురించిన కథనం మాత్రం నిజమేనని సంస్థ అంగీకరించింది.

వ్యాపార దిగ్గజం, మైక్రోసాఫ్ట్​ సహవ్యవస్థాపకుడు బిల్​ గేట్స్​.. 2008లో ఓ మహిళా ఉద్యోగిని ఫ్లర్ట్​ చేసేవారు. ఆమెకు ఈమెయిల్స్​ పంపేవారు. ఆయన్ని మైక్రోసాఫ్ట్​ ఓ సందర్భంలో హెచ్చరించింది కూడా. ఇప్పుడు ఈ విషయాన్ని సంస్థ స్వయంగా వెల్లడించిందని అమెరికాకు చెందిన వాల్​ స్ట్రీట్​ జర్నల్​ ఓ కథనాన్ని ప్రచురించింది.

ప్రస్తుత మైక్రోసాఫ్ట్​ అధ్యక్షుడు, వైస్​ ఛైర్మన్​ బ్రాడ్​ స్మిత్​.. మరో అధికారితో కలిసి ఈ విషయంపై గేట్స్​ను అప్పట్లో కలిశారని పత్రిక పేర్కొంది. ఈమెయిల్స్​పై వారు ఆరా తీసినట్టు వెల్లడించింది.

ఈ వ్యవహారాన్ని గేట్స్​ కొట్టిపారేయలేదని, అయితే ఆ మహిళా ఉద్యోగి- వ్యాపార దిగ్గజం మధ్య ఎలాంటి లైంగిక బంధం లేకపోవడం వల్ల సంస్థ ఆయనపై చర్యలు తీసుకోలేదని వార్తాపత్రిక తెలిపింది.

ఈ కథనంపై మరిన్ని వివరాలు వెల్లడించేందుకు సంస్థ నిరాకరించింది. అయితే వాల్​ స్ట్రీట్​ ప్రచురించింది మాత్రం నిజమేనని సంస్థ అంగీకరించింది. అటు బ్రాడ్​ స్మిత్​ కార్యాలయం ఎటువంటి ప్రకటన చేయలేదు.

అయితే బిల్​ గేట్స్​ వ్యక్తిగత కార్యాలయం మాత్రం దీనిని తీవ్రంగా ఖండించింది. 'అసలు ఏం జరిగిందో తెలియని వారు, విషయంపై సరైన అవగాహన లేని వారి నుంచి ఈ ఊహాగానాలు వెలువడ్డాయి. వాటిల్లో ఏ మాత్రం నిజం లేదు,' అని ఓ ప్రకటనను విడుదల చేసింది.

పాల్​ ఆలెన్​తో కలిసి 1975లో కంపెనీని స్థాపించారు బిల్​ గేట్స్​. 2000వరకు సీఈఓగా పనిచేశారు. 2008 తర్వాత కంపెనీకి సంబంధించిన రోజువారీ కార్యకలాపాల నుంచి నెమ్మదిగా తప్పుకున్నారు. 2014 వరకు కంపెనీ ఛైర్మన్​గా వ్యవహరించారు.

పూర్తిస్థాయి ఉద్యోగి బాధ్యతల నుంచి గేట్స్​ తప్పుకుంటున్న రోజుల్లో ఈ ఘటన జరిగినట్టు మైక్రోసాఫ్ట్​ ప్రతినిధి ఫ్రాంక్​ షా తెలిపారు. మహిళా ఉద్యోగితో గేట్స్​ ఫ్లర్ట్​ చేస్తూ ఈమెయిల్స్​ పంపేవారని, ఆఫీసు బయట కలుద్దామని అడిగేవారని షా పేర్కొన్నారు.

కొత్తేమీ కాదు...!

బిల్​ గేట్స్​పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇది కొత్తేమీ కాదు. గేట్స్​తో తనకు ఎన్నో ఏళ్లుగా.. లైంగిక సంబంధం ఉందని 2019లో ఓ ఇంజినీర్​ సంచలన లేఖ రాసింది. దానిపై సంస్థ 2021లో దర్యాప్తు చేపట్టింది.

వాటాదురుల ఆందోళన!

మైక్రోసాఫ్ట్​లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ అర్జున క్యాపిటల్​ ఇన్​వెస్టర్ సంస్థ​.. వాటాదారుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. పనిప్రదేశాల్లో జరుగుతున్న హింసపై నివేదికలు బయటపెట్టి, చర్యలు తీసుకోవాలన్న ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. వచ్చే నెలలో జరగనున్న షేర్​హోల్డర్ల వార్షిక సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరగనున్నట్టు సమాచారం.

అయితే ఈ ప్రతిపాదనను వాటాదారులు తిరస్కరించాలని మైక్రోసాఫ్ట్​ అభ్యర్థించింది. పనిప్రదేశాల్లో జరిగే వ్యవహారాలను బహిరంగంగా వెల్లడించేందుకు తాము ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్టు, అందువల్ల కొత్త విధానాలేవీ అవసరం లేనట్టు వెల్లడించింది.

ఇదీ చూడండి:- బిల్​గేట్స్ జీవితంలో చీకటి కోణం... అందుకే అలా...

Last Updated :Oct 19, 2021, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.