ETV Bharat / international

కొవిడ్​ విధ్వంసం- ఇరాన్​లో 50వేలు దాటిన మరణాలు

author img

By

Published : Dec 5, 2020, 9:24 PM IST

Iran's virus deaths pass 50,000 as lockdown on capital eases
కొవిడ్​ విధ్వంసం- ఇరాన్​లో 50వేలు దాటిన మరణాలు

ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. ఇప్పటివరకు 6కోట్ల 63లక్షలకుపైగా వైరస్​ కేసులు నమోదయ్యాయి. వారిలో 15లక్షల 27వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్​, రష్యాలలో కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు 6.63 కోట్ల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. వారిలో 15.27లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. ఇప్పటివరకు 4కోట్ల 59లక్షల మంది కొవిడ్​ను జయించగా.. కోటీ 89లక్షల యాక్టివ్​ కేసులున్నాయి.

  • కరోనా కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో వైరస్​ విలయతాండవం కొనసాగుతోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 14.78 లక్షల కేసులు నమోదయ్యాయి. వారిలో 2.85లక్షల మందిని కొవిడ్​ బలితీసుకుంది.
  • రష్యాలో వైరస్​ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 28,782 మందికి కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24లక్షల 31వేలు దాటింది. ఆ దేశంలో ఇప్పటివరకు 42,684 కరోనా మరణాలు సంభవించాయి.
  • ఇరాన్​లో కొవిడ్​ మృతుల సంఖ్య 50వేలు దాటింది. లాక్​డౌన్​ ఆంక్షలను సడలించడం వల్లే వైరస్​ మరణాలు పెరిగిపోతున్నాయని అక్కడి అధికారులు వెల్లడించారు. ఆ దేశంలో ఇప్పటివరకు 10లక్షల 28వేలకుపైగా వైరస్ కేసులు వెలుగుచూశాయి.
  • పొరుగుదేశం నేపాల్​లో మరో 1,024 మందికి కరోనా సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 2.39లక్షలకు ఎగబాకింది. మహమ్మారి ధాటికి మరో 10 మంది బలవ్వగా.. మరణాల సంఖ్య 1,577కు చేరింది.

కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలివే..

దేశంమొత్తం కేసులుమొత్తం మరణాలు
అమెరికా1,47,81,0432,85,738
బ్రెజిల్​65,34,9511,75,981
రష్యా24,31,73142,684
ఫ్రాన్స్​22,68,55254,767
స్పెయిన్​16,99,14546,252
బ్రిటన్​16,90,43260,617
ఇటలీ16,88,93958,852
అర్జెంటీనా14,54,63139,512
కొలంబియా13,52,60737,467

ఇదీ చదవండి: 'టీకా గురించి అలా అనలేదు క్షమించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.