ETV Bharat / international

Hurricane Ida: అంతా పోయింది.. బురదే మిగిలింది!

author img

By

Published : Sep 2, 2021, 4:50 PM IST

ida
ఇడా

ఇడా హరికేన్​(hurricane ida 2021) బీభత్సంతో అగ్రరాజ్యం అల్లకల్లోలంగా మారింది. లాస్​ఏంజెల్స్​, న్యూయార్క్​, న్యూజెర్సీ.. ఇలా దేశంలోని అనేక ప్రాంతాలు ఇడా కారణంగా విలవిలలాడుతున్నాయి. నివాసాల్లోకి వరద నీరు చేరడం వల్ల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇడా ధాటికి 8 మంది మరణించినట్టు సమాచారం.

ఇడా తుపాను (hurricane ida 2021) ధాటికి అమెరికా విలవిలలాడుతోంది. అగ్రరాజ్యంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలుల ధాటికి అనేక చెట్లు నేలకూలాయి. చాలా చోట్ల విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. న్యూయార్క్​, న్యూజెర్సీలో 8 మంది మరణించినట్టు తెలుస్తోంది. అనేకమంది క్షతగాత్రులైనట్టు సమాచారం.

దక్షిణ న్యూజెర్సీ(usa hurricane news)లో ఓ టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడో ధాటికి అనేక ఇళ్లు నెలమట్టమయ్యాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు రాత్రింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు శ్రమిస్తున్నారు.

Ida US
భారీ వర్షాల కారణంగా మారిస్ రోడ్డులో నీట మునిగిన వాహనాలు.
Ida US
పెన్సిల్వేనియాలో రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది
Ida US
ఈదురు గాలుల ధాటికి పెన్సిల్వేనియాలో​ నేల కూలిన వృక్షం
Ida US
మాంట్​గొమెరి కౌంటీలో ఇడా బీభత్సం- రాకపోకలకు అంతరాయం
Ida US
చెస్టర్​ కౌంటీ వెస్ట్​టౌన్​ టౌన్​షిప్​లో...
Ida US
ఎటు చూసినా చెత్తే.. అన్నాపొలిస్​ వీధుల్లో..
Ida US
న్యూ ఆర్లీన్స్​లోని పునరావాస కేంద్రం వద్ద మంచి నీరు పంపిణీ
Ida US
లాస్​ఏంజెల్స్​లో ఇంట్లోకి చేరిన వరద నీరు.. యజమాని కన్నీరు.
Ida US
వలస వెళుతున్న వారికి సహాయం చేసే స్థితిలో లేక...
Ida US
లాస్​ఏంజెల్స్​లో.. కుప్పకూలిన స్టోరేజీ యూనిట్​ను చూసి విలపిస్తూ..
Ida US
వరదల ధాటికి వర్జీనియాలో ధ్వంసమైన ఇళ్లు, రోడ్లు
Ida US
వర్జీనియాలో కొట్టుకుపోతున్న వాహనం

ఇదీ చూడండి:- Hurricane Ida: తుఫాన్​​ ఎఫెక్ట్​- రివర్స్​ గేర్​లో ప్రవహిస్తున్న నది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.