ETV Bharat / international

'చైనా ముందస్తు ప్రణాళిక ప్రకారమే గల్వాన్​​ దాడి'

author img

By

Published : Dec 2, 2020, 1:06 PM IST

Updated : Dec 2, 2020, 2:45 PM IST

ముందుగా రూపొందించిన పథకం ప్రకారమే గల్వాన్​ లోయలో భారత సైనికులపై చైనా బలగాలు దాడి చేసినట్లు అమెరికాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. దాడికి సంబంధించి అనేక విషయాలను తన ద్వారా నివేదిక బట్టబయలు చేసింది.

The galwan incident is a Chinese government Plan
పథకం ప్రకారమే గాల్వన్​లో చైనా దాడి

గల్వాన్​లో లోయలో భారత సైనికులపై చైనా దళాలు అక్రమంగా దాడికి తెగబడిన ఘటనకు సంబంధించి అమెరికా-చైనా ఆర్థిక, భద్రత సమీక్ష కమిషన్​ ఓ నివేదిక విడుదల చేసింది. చైనా ముందుగా రూపొందించిన పథకం ప్రకారమే దాడి చేసినట్లు తేల్చిచెప్పింది.

జూన్​ 15న దాడి జరగగా.. అంతకు ముందే పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి ఆయుధాలు, 1000 మంది పీఎల్​ఏ దళాలను తరలించినట్లు నివేదికలో వివరించింది. ఉపగ్రహ ఛాయా చిత్రాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిపింది.

చైనా అధికారిక పత్రిక 'గ్లోబల్‌ టైమ్స్‌' తన సంపాదకీయంలో గల్వాన్‌ లోయపై ముందుగానే హెచ్చరికలు చేసినట్లు వెల్లడించింది అమెరికా-చైనా ఆర్థిక, భద్రత సమీక్ష కమిషన్. ఈ ఘటనలకు ముందు చైనా రక్షణ మంత్రి కూడా రెచ్చగొట్టే ప్రకటనలు చేశారన్న విషయాన్ని గుర్తు చేసింది.

జింగ్‌ పింగ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య ఐదు సార్లు పెద్ద స్థాయిలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు గుర్తుచేసింది.

ఇదీ చూడండి:'ఉగ్రవాదం వల్ల అలాంటి మరో మారణహోమం'

Last Updated : Dec 2, 2020, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.