ETV Bharat / international

వుహాన్​ ల్యాబ్​పైనే వారి అనుమానం- తీవ్ర ఒత్తిడిలో చైనా!

author img

By

Published : May 28, 2021, 2:18 PM IST

కరోనా వైరస్ మూలాల(coronavirus origin) విషయమై చైనా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. కొవిడ్​-19 పుట్టుకకు సంబంధించి మరింత స్పష్టమైన సమాచారం కావాలని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు డిమాండ్ చేస్తుండటమే ఇందుకు కారణం. చైనా చెబుతున్నట్లు అలుగు నుంచి వైరస్​ వ్యాప్తి చెంది ఉండకపోవచ్చని, వుహాన్(​ ల్యాబ్( wuhan lab)నుంచే బయటకు రావచ్చని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

coronavirus origin
వుహన్​ ల్యాబ్​పైనే శాస్త్రవేత్తల అనుమానం

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మూలాలకు సంబంధించిన(coronavirus origin) కీలక సమాచారాన్ని చైనా దాస్తోందని అంతర్జాతీయ శాస్త్రవేత్తల సమాజం విశ్వసిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్( New yark Times) తెలిపింది. కరోనా పుట్టుకపై మరింత స్పష్టమైన సమాచారం కోసం దర్యాప్తు జరపాలని శాస్త్రవేత్తలు డిమాండ్ చేస్తున్న కారణంగా డ్రాగన్ దేశం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుందోని పేర్కొంది. కరోనా మూలాల విషయంలో (coronavirus origin) అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల సమాజాన్ని చైనా మోసగించిందని నిపుణులు చెబుతున్నట్లు పేర్కొంది.

స్కై న్యూస్ ఆస్ట్రేలియా హోస్ట్​ ఆండ్రూ బోల్ట్​ తన షోలో ఫ్లిండర్స్ మెడికల్​ సెంటర్​ ఎండోక్రినాలజీ డైరెక్టర్,​ ప్రొఫెసర్​ నికోలాయ్​ పెట్రోవ్​స్కీతో మాట్లాడారు. ప్రపంచ శాస్త్రవేత్తలను చైనా తప్పుదోవ పట్టించిందని ఆయన​ అభిప్రాయడినట్లు న్యూయార్క్​ టైమ్స్​ తెలిపింది. ప్రస్తుతం ఎంతో మంది నిపుణులు వుహాన్ ల్యాబ్​ నుంచే వైరస్​ బయటకు వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారని, అందుకే చైనా ఒత్తిడికి గురవుతోందని పెట్రోవ్​స్కీ చెప్పినట్లు వెల్లడించింది.

అలుగుల వైరస్​తో సారుప్యత

"అలుగుల నుంచే వైరస్ మానవులకు వ్యాప్తి చెంది ఉండవచ్చని చెప్పేందుకు చైనా శాస్త్రవేత్తలందరూ ప్రయత్నిస్తున్నారు. కానీ వైరాలజిస్టులందరూ అలా జరిగి ఉండకపోవచ్చని ఇప్పుడు భావిస్తున్నారు. అలుగులోని స్పైక్ ప్రొటీన్లు​, కొవిడ్-19 స్పైక్ ప్రొటీన్లకు​ కొంత సారుప్యత ఉంది. అలుగు స్పైక్ ప్రొటీన్​ను సేకరించి దాన్ని గబ్బిలం వైరస్​లోకి పంపడం, జన్యువులను వేరు చేయడం వంటి పనులు ల్యాబ్​లో పనిచేసే ఎవరికైనా చాలా సులభం. ఇది మనందరికీ, ప్రజలకు తెలిసిన పరిశోధన విధానం. ఇలాంటి పరిశోధననే వుహాన్ ల్యాబ్​ కొద్ది సంవత్సరాలుగా చేపడుతోంది." అని పెట్రోవ్​స్కీ చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్​ వివరించింది.

అయితే వైరస్​ మానవ సృష్టే, వుహాన్​ ల్యాబ్(wuhan lab)​ నుంచే బయటకు వచ్చిందనే ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

ఆధారాల్లేవ్​..

కరోనా మూలాలపై దర్యాప్తునకు చైనా వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం.. వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ ఉద్భవించింది అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఇప్పటికే ప్రకటించింది. అయితే కరోనా వాప్తి మొదలైన తొలినాళ్ల కీలక సమాచారాన్ని ఇచ్చేందుకు చైనా నిరాకరించిందని డబ్ల్యూహెచ్​ఓ బృందంలోని ఒకరు బ్రిటన్ వార్తా సంస్థకు చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

వుహాన్ ల్యాబ్​ నుంచే వైరస్ లీక్ అయి ఉంటుందనే విషయంపై దర్యాప్తు జరపాలని అమెరికా ఇటీవలే డిమాండ్ చేసింది. అయితే ఈ ఆలోచనను చైనా ప్రభుత్వ మీడియా తప్పుబట్టింది. తమపై అమెరికా నిఘా వర్గాలు కుట్రపన్నుతున్నాయని ఆరోపించినట్లు న్యూయార్క్ టైమ్స్ చెప్పింది.

ఇదీ చూడండి: కరోనా వైరస్​తో ఆయుధాలు- 2015లోనే చైనా చర్చ!

డబ్ల్యూహెచ్​ఓకు చుక్కలు చూపించిన చైనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.