ETV Bharat / international

జెఫ్​ బెజోస్​ రోదసి యాత్ర విజయవంతం!

author img

By

Published : Jul 20, 2021, 6:10 PM IST

Updated : Jul 20, 2021, 7:47 PM IST

Jeff Bezos Space Tour
జెఫ్​ బెజోస్ స్పేస్​ టూర్ లైవ్​

18:52 July 20

జెఫ్​ బెజోస్ అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తయింది. బెజోస్ సహా నలుగురు సభ్యుల బృందంతో కూడిన క్యాప్సుల్​ సురక్షితంగా భూమికి చేరుకుంది.

18:43 July 20

బెజోస్ అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది. పశ్చిమ టెక్సాస్​ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్​ సైట్​ వన్​ నుంచి బ్లూ ఆరిజిన్ షెపర్డ్​ రోదసిలోకి దూసుకెళ్లింది.

18:15 July 20

రోదసిలోకి ప్రయాణించనున్న బృందం బ్లూ ఆరిజిన్ అంతరిక్ష నౌక ఎక్కి ప్రయాణానికి సిద్ధమయ్యారు.

17:48 July 20

బెజోస్​ రోదసి యాత్ర లైవ్​ అప్​డేట్స్​

ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్​ అంతరిక్షయాత్రకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో.. బెజోస్​, ఆయన సోదరుడు మార్క్ బెజోస్ సహా మరో ఇద్దరు రోదసిలోకి ప్రయాణించనున్నారు. బెజోస్​కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థకు చెందిన అంతరిక్ష నౌక ద్వారా వీరు నింగిలోకి దూసుకెళ్లనున్నారు.

పశ్చిమ టెక్సాస్​ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్​ సైట్​ వన్​ నుంచి మంగళవారం ఉదయం 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు) న్యూ షెపర్డ్​ దూసుకెళ్లనుంది.

ఈ బృందం.. భూవాతావరణానికి, రోదసికి సరిహద్దు అయిన కర్మాన్​ రేఖ ఆవల, భూమి నుంచి 100కిలోమీటర్ల ఎత్తులో 11 నిమిషాలు గడుపనుంది.

Last Updated : Jul 20, 2021, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.