ETV Bharat / international

మా పాలన నుంచి చైనా గట్టి పోటీ ఆశిస్తోంది: బైడెన్​

author img

By

Published : Feb 8, 2021, 10:28 AM IST

US President Joe Biden
మా నుంచి చైనా తీవ్ర పోటీ ఆశిస్తోంది: బైడెన్​

అమెరికా నుంచి చైనా తీవ్రమైన పోటీ ఆశిస్తోందని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​ అన్నారు. అయితే.. తాను చైనాతో సంఘర్షణతో కూడుకున్న బంధాన్ని కోరుకోవడం లేదని.. కేవలం అంతర్జాతీయ అంశాలపైనే దృష్టిసారించనున్నట్టు వెల్లడించారు. చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ తనకు బాగా తెలుసని ఈ సందర్భంగా చెప్పారు బైడెన్​.

తమ పాలన నుంచి చైనా గట్టి పోటీని ఆశిస్తోందని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​ వ్యాఖ్యానించారు. అయితే.. చైనాతో ఏర్పరచుకోనున్న ఆ బంధం.. సంఘర్షణతో కూడుకున్నది కాదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు బైడెన్​. ఇప్పటివరకు చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​తో తానింకా మాట్లాడలేదని ఆయన అన్నారు. అయితే.. గతంలో తాము ఉపాధ్యక్షులుగా ఉన్న కాలంలో తమ మధ్య సత్సంబంధాలున్నాయని బైడెన్​ గుర్తుచేశారు. జిన్​పింగ్​ తనకు సన్నిహితుడని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​లాగా.. తాను అమెరికా-చైనా సంబంధాలను కొనసాగించబోనని బెడెన్​ స్పష్టం చేశారు. కేవలం అంతర్జాతీయ అంశాలపైనే దృష్టి సారిస్తానని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఎలాంటి వివాదం కోరుకోవట్లేదన్న బైడెన్.. చైనాయే తీవ్ర పోటీని ఆశిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు సంకేతాలు కూడా పంపుతోందన్నారు.

మరోవైపు.. బైడెన్​ తన తొలి టెలిఫోన్​ దౌత్యాన్ని యూఎస్​ మిత్ర దేశాలపై కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఆయన ఇప్పటివరకు కెనడా, మెక్సికో, యూకే, ఫ్రాన్స్​, జర్మనీ, జపాన్​, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా నాయకులు సహా.. నాటో ప్రధాన కార్యదర్శులతో సంభాషించారు. అంతేకాకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్​ పుతిన్​తోనూ మాట్లాడారు బైడెన్.

ఇదీ చదవండి: తిరిగి ఐరాస మానవహక్కుల సంఘంలోకి అమెరికా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.