ETV Bharat / international

అలాంటి లాయర్​ కోసం ట్రంప్ అల్లుడి అన్వేషణ

author img

By

Published : Nov 6, 2020, 11:18 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు పరభావం తప్పని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో కోర్టుకెళ్లి ఎలాగైనా కౌంటింగ్​ను ఆపేలా చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు ఆయన అల్లుడు జేర్డ్​ కుష్నర్. ఫలితంగా ట్రంప్​ మెజారిటీ ఉన్న రాష్ట్రాల్లో గెలిచి మరోసారి అధ్యక్షుడయ్యే అవకశాలను పెంచాలని చూస్తున్నారు. 2000 సంవత్సరం ఎన్నికల్లో​ ఫ్లోరిడాలో రీకౌంటింగ్​ను ఆపేలా చేసి బుష్​ను గెలిపించిన జేమ్స్​ బేకర్ వంటి అటార్నీ జనరల్​ కోసం ట్రంప్​ అల్లుడు బుధవారం మొత్తం అన్వేషించినట్లు తెలిసింది.

Biden and Harris on the brink of history, Trump son-in-law hunts for lawyers
కౌటింగ్​ను ఆపగల సత్తాఉన్న లాయర్​ కోసం ట్రంప్ అల్లుడి అన్వేషణ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు జో బైడెన్, కమలా హారిస్ విజయం దాదాపు ఖరారైంది. వారు ఇంకా 6 ఎలక్టోరల్ ఓట్లు గెలిస్తే మ్యాజిక్ ఫిగర్​ను అందుకుంటారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఓట్ల లెక్కింపును ఆపితే మాత్రం ట్రంప్​కు విజయావకాశాలు ఉంటాయి. అందుకే కోర్టును సంప్రందించి కౌంటింగ్​ను అపేలా చేయగలిగే ఓ శక్తిమంతమైన న్యాయవాది​ కోసం ట్రంప్ అల్లుడు జేర్డ్​ కుష్నర్ తీవ్రంగా అన్వేషిస్తున్నారు. 2000 సంవత్సరం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఫ్లోరిడాలో రీకౌంటింగ్​ను ఆపి, జార్జి డబ్ల్యూ బుష్​ గెలిచేలా చేసిన జేమ్స్ బేకర్ వంటి లాయర్​ను కనిపెట్టే పనిలో పడ్డారు. కుష్నర్​ బుధవారం మొత్తం ఇదే పనిలో ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్​ కథనం ప్రచురించింది.

అమెరికా మీడియా లెక్కల ప్రకారం ప్రస్తుతం బైడెన్​ 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. మ్యాజిక్​ ఫిగర్​కు 6 ఓట్ల దూరంలో ఉన్నారు. ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లే గెలిచారు. అయితే జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో ఆయన ముందంజలో ఉన్నారు.

ట్రంప్​కు చుక్కెదురు..

మిషిగన్, జార్జియా ఎన్నికల్లో అవకతవకలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బృందం వేసిన దావాలను అమెరికా కోర్టులు కొట్టివేశాయి. మిషిగన్​లో స్థానిక లెక్కింపు ప్రక్రియతో రాష్ట్ర కార్యదర్శికి సంబంధం లేదని స్పష్టం చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు న్యాయమూర్తి సింథియా స్టీఫెన్స్. జార్జియాలోనూ పిటిషనర్ల అభ్యర్థనను జడ్జి జేమ్స్ బాస్ తిరస్కరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.