ETV Bharat / entertainment

Bigg Boss 7 Telugu Third Week Elimination: బిగ్​బాస్​లో మారిన లెక్కలు.. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేది ఆమెనా..?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 6:09 PM IST

Bigg Boss 7 Telugu Third Week Elimination: బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం మూడో వారంలో ఉంది. ఇప్పటికే హౌజ్​ నుంచి నుంచి కిరణ్ రాథోడ్, షకీలా ఎలిమినేట్ కాగా.. మూడో వారం ఎలిమినేషన్​ కోసం ఏడుగురు నామినేట్​ అయ్యారు. మరి వీరిలో ఎవరు బ్యాగ్ సర్దేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss 7
Bigg Boss 7

Bigg Boss 7 Telugu Third Week Elimination : బుల్లితెర భారీ రియాలిటీ షో బిగ్ బాస్ హవా కొనసాగుతోంది. ఎక్కడోచోట ఈ షోపై వ్యతిరేకత వస్తున్నప్పటికీ.. సక్సెస్ ఫుల్​గా రన్ అవుతోంది. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఏడో సీజన్​లో(Bigg Boss 7 Telugu) అంతా ఉల్టా పుల్టా అంటూ రంగంలోకి దిగారు. అయితే బిగ్​బాస్​ అంటేనే నామినేషన్స్​.. సెప్టెంబర్​ 3 ఆదివారం నాడు షో స్టార్ట్​ అవ్వగా.. సోమవారం నుంచే నామినేషన్స్​తో ఆట మొదలు పెట్టాడు పెద్దన్న. తొలివారం జరిగిన ఎలిమినేషన్​లో కిరణ్ రాథోడ్.. రెండో వారం ఎలిమినేషన్​లో షకీలా ఇంటి నుంచి బయటకు వెళ్లారు.

Bigg Boss 7 Telugu Second Week Elimination : బిగ్​ బాస్​లో ఊహించని ట్విస్ట్.. ఈవారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా.!

Bigg Boss Telugu 7 Update : ఇప్పుడు బిగ్‌బాస్ మూడో వారానికి(Bigg Boss 3rd Week Nominations) సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ షురూ అయింది. మూడో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం ఏడుగురు ఉన్నారు. దామిని, శుభశ్రీ రాయగురు, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్.. ఈ ఏడుగురు ఈవారం ఓటింగ్‌లో పోటీ పడుతున్నారు. అయితే ఈ ఏడుగురితో పాటు టేస్టీ తేజ కూడా నామినేట్​ అవ్వగా.. రెండో పవరాస్త్రను గెలుచుకున్న శివాజీ.. తేజను సేఫ్​ చేశాడు. దాంతో నామినేషన్​ ప్రక్రియ పూర్తి కాగా.. ఆ రాత్రి(సెప్టెంబర్​ 18) నుంచే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి.

Voice Behind Bigg Boss Season 7 Telugu: బిగ్​బాస్​ హౌస్​లో వినిపించే గొంతు ఎవరిదో కాదు.. ఇతనిదే..!

అయితే బుధవారం సాయంత్రం(సెప్టెంబర్​ 20) వరకూ అమర్​దీప్​ అత్యధిక ఓటింగ్‌తో టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఆ రాత్రి టెలికాస్ట్​ అయినా ఒక్క ఎపిసోడ్​తో ఓటింగ్​ స్వరూపమే మారిపోయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. మొదటి స్థానంలో ఉన్న అమర్​ను.. ప్రిన్స్ యావర్ అధిగమించి ఫస్ట్​ ప్లేస్​లోకి రాగా.. గౌతమ్ కృష్ణ రెండో ప్లేస్​లో, అమర్​ మూడో ప్లేస్​లో ఉన్నారు. ఇక తర్వాతి స్థానంలో ప్రియాంక జైన్​, రతిక రోజ్​, శుభ శ్రీ, దామిని ఉన్నారనే వార్త సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

అయితే లాస్ట్​ ప్లేస్​లో శుభ శ్రీ, దామిని ఉండటంతో.. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేటి అవుతారని అందరూ అనుకుంటున్నారు. అయితే బిగ్​బాస్​ అంటేనే ట్విస్ట్​లకు కేరాఫ్​ అడ్రస్​. అదీ కాక ఈసారి ఉల్టా పల్టా అంటూ మొదలుపెట్టారు. అలాగే ఈరోజు రాత్రి వరకూ ఓటింగ్​ లైన్స్​ ఓపెన్​లో ఉండటంతో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారని ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ఈ వారం ఇంటి నుంచి బ్యాగ్​ సర్దేది ఎవరో..!

Amardeep Chowdary BiggBoss : పొలిటికల్ ఫ్యామిలీ.. లండన్‌లో స్టడీస్​.. సీరియల్​ హీరో అమర్ ​దీప్​ బ్యాక్​గ్రౌండ్​​ తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.