ETV Bharat / entertainment

Bigg Boss 7 Telugu Second Week Elimination : బిగ్​ బాస్​లో ఊహించని ట్విస్ట్.. ఈవారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా.!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 7:45 PM IST

Bigg Boss 7 Telugu Second Week Elimination : బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే.. మొదటివారం ఎలిమినేషన్ అయిపోగా.. రెండోవారం నామినేషన్స్ ముగిశాయి. ఈవారం మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. మరి.. వీరిలో రెండోవారం బిగ్ బాస్ హౌస్​ను వీడి ఇంటి బాట పట్టేదెవరు..??

Bigg Boss 7 Telugu Second Week Elimination
Bigg Boss 7

Bigg Boss 7 Telugu Second Week Elimination : Bigg Boss 7 Telugu Second Week Elimination : బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్.. రెండో వారంలోకి ప్రవేశించింది. 14 మందితో మొదలైన ఈ సీజన్​.. ఫస్ట్ వీక్ నుంచే ఉత్కంఠ భరితంగా సాగుతోంది. దీనికి కారణం.. ఈ సీజన్లో అంతా ఉల్టా పల్టా అంటూ బిగ్ బాస్ ప్రకటించడమే. దీంతో.. అందరూ డే ఫస్ట్ నుంచే.. "బిగ్​బాస్"​ తన ఆట మొదలుపెట్టేశాడుగా అనుకున్నారు. కంటిస్టెంట్లు అందరిలోనూ ఎలిమినేషన్ భయం పట్టుకుంది. దీంతో.. అందరూ ఆచితూచి గేమ్ ఆడుతున్నారు. మొదటివారంలో హౌస్ నుంచి కిరణ్ రాథోడ్(Big Boss First Week Elimination) ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఇక, రెండో వారం వంతు ఎవరిదో.. అని ఇటు ఆడియెన్స్, అటు కంటిస్టెంట్స్.. ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Bigg Boss Telugu 7 Season Latest Update : బిగ్ బాస్ తెలుగు 7 సీజన్(Bigg Boss Season 7) రెండో వారానికి సంబంధించి నామినేషన్లు హోరాహోరీగా సాగిన విషయం తెలిసిందే. మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్స్ కు నామినేట్ అయ్యారు. వీరిలో.. శివాజీ, షకీలా, శోభా శెట్టి, టేస్టీ తేజా, రతిక, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ ఉన్నారు. దీంతో.. వీరిలో హౌస్ లో మిగిలేది ఎవరు.. కంటిన్యూ అయ్యేది ఎవరు అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మొదటి వారంతో పోల్చుకుంటే రెండో వారం నామినేషన్స్.. ప్రేక్షకులను ఆకర్షించేలా సాగాయి. పైగా బిగ్ బాస్ ఈ నామినేషన్స్ మాత్రమే రెండురోజులు ప్రసారం చేశారు. ముఖ్యంగా.. శివాజీ, పల్లవి ప్రశాంత్ నామినేషన్స్.. బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ చూసే ఫ్యాన్స్‌కు ఫుల్ మజాను అందించాయి. గత ఆరు సీజన్లలో ఒక్కో కంటెస్టెంట్​కు 10 ఓట్లల్లో ఎన్నైనా వేసుకునే అవకాశం ఉండగా.. ఈ సారి.. ఒక కంటెస్టెంట్‍కు ఒక్క ఓటు మాత్రమే వేసే విధానాన్ని అమలు చేస్తున్నారు.

Voice Behind Bigg Boss Season 7 Telugu: బిగ్​బాస్​ హౌస్​లో వినిపించే గొంతు ఎవరిదో కాదు.. ఇతనిదే..!

ఇదిలా ఉంటే.. ఈ వారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హౌస్​లో.. త్రిబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. హోస్ట్ ​ నాగార్జున ముందుగానే చెప్పినట్టుగా.. ఉల్టా పుల్టా అంటూ ఊహించని ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నారు. ఈ క్రమంలోనే ముగ్గురిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపుతారానే ప్రచారం గట్టిగానే సాగుతోంది. అయితే.. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ నుంచి డబుల్ ఎలిమినేషన్ మాత్రమే జరిగింది కానీ, ఎప్పుడూ ముగ్గురిని హౌస్ నుంచి బయటకు పంపలేదు. బిగ్ బాస్ సీజన్​ 7లో మొదటి సారి ఇలా చేయనున్నారని తెలుస్తోంది. అలాగే.. ఒకేసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అని ప్రకటించి ఒకరిని సీక్రెట్ రూమ్​లోకి పంపుతారని కూడా ప్రచారం సాగుతోంది.

మరింత కొత్తగా 'బిగ్‌బాస్‌ 7'.. 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌'..

Bigg Boss Telugu Season 7 : అయితే.. ఇక రెండో వారం హౌస్ నుంచి ఎలిమినేటై.. బయటకు వచ్చే వారిలో పల్లవి ప్రశాంత్ ఉంటాడని టాక్ నడుస్తోంది. అయితే.. మరో ప్రచారం కూడా ఉంది. అతడిని ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించి సీక్రెట్ రూమ్​లోకి తోసేసి.. ఆ తర్వాత తిరిగి హౌస్​లోకి తీసుకువస్తారని కూడా అంటున్నారు. ఇదిలాఉంటే.. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో పల్లవి ప్రశాంత్​కు కావాల్సినంత సింపతీ వర్కౌట్ అయ్యింది. హౌస్​లో ఉన్నవారు ప్రశాంత్​ను టార్గెట్ చేయడంతో.. బయట ఉన్న ప్రేక్షకుల్లో అతడికి ఆదరణ పెరిగింది. దీంతో.. రైతు బిడ్డకు భారీగానే ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. సరిగ్గా.. ఇక్కడే బిగ్ బాస్ గేమ్ ఛేంజ్ చేస్తున్నట్టు సమాచారం. పల్లవి ప్రశాంత్​ ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించడం ద్వారా.. సెన్సేషన్ క్రియేట్ అవుతుందని.. తద్వారా.. సీజన్ 7 మరింత రసవత్తరంగా మారుతుందని బిగ్ బాస్ టీమ్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో.. రెండో వారం ఎవరు ఇంటికి వెళ్తారనేది ఉత్కంఠగా మారింది. మరి, ఫైనల్ గా ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Bigg boss 7 Telugu : కార్తీక దీపం మోనిత.. ఇన్ని కష్టాలు పడిందా? కాళ్లకు చెప్పులు కూడా లేకుండా!

Amardeep Chowdary BiggBoss : పొలిటికల్ ఫ్యామిలీ.. లండన్‌లో స్టడీస్​.. సీరియల్​ హీరో అమర్ ​దీప్​ బ్యాక్​గ్రౌండ్​​ తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.