ETV Bharat / entertainment

మళ్లీ కుర్రహీరోలతో బాలయ్య హంగామా.. 'అన్​స్టాపబుల్​-2'కు గెస్ట్​లుగా శర్వానంద్​, అడవి శేష్​

author img

By

Published : Oct 30, 2022, 3:14 PM IST

young heroes sharwanand and adavi shesh as guests for balakrishna unstoppable 2 talk show
young heroes sharwanand and adavi shesh as guests for balakrishna unstoppable 2 talk show

బాలయ్య హోస్ట్​గా వ్యవహరిస్తున్న 'అన్​స్టాపబుల్​ షో-2'కు సంబంధించి కొత్త అప్డేట్​ వచ్చింది. సీజన్ 2 మూడో ఎపిసోడ్​కు​ గెస్ట్​లుగా యువ హీరోలు శర్వానంద్​, అడవి శేష్​ సందడి చేశారు.

Balakrishna Unstoppable Episode3: టాలీవుడ్​ స్టార్​ హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్‌ షో 'అన్‌స్టాపబుల్-2'. ఇటీవల ప్రారంభమైన ఈ టాక్‌ షో సెకండ్‌ సీజన్‌ ప్రస్తుతం సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్వరలో టెలికాస్ట్​ కాబోయే మూడో ఎపిసోడ్​కు టాలీవుడ్‌ యువ నటులు అడవి శేష్​, శర్వానంద్ వచ్చి సందడి చేశారు.

young heroes sharwanand and adavi shesh as guests for balakrishna unstoppable 2 talk show
బాలకృష్ణతో అడవి శేష్​, శర్వానంద్​

సీజన్ 2 మొదటి ఎపిసోడ్​కు​ గెస్ట్​లు​గా మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయడు, ఆయన కుమారుడు లోకేశ్​ వచ్చారు. గంటపాటు నవ్వుల వర్షం కురిపించారు. రెండో ఎపిసోడ్​ అదే రేంజ్​లో ఉండేందుకు.. మాస్​కా దాస్​ విశ్వక్​ సేన్​, 'డీజే టిల్లు'తో అలరించిన సిద్ధు జొన్నలగడ్డ వచ్చారు. ఇందులో ఇద్దరు యువ కథానాయకులతో.. బాలయ్య అల్లరి మామూలుగా లేదు. ఇప్పుడు మూడో ఎపిసోడ్​కు మళ్లీ యువనటులు శర్వానంద్​, అడవి శేష్​ వచ్చారు. వీళ్ల రాకతో మూడో ఎపిసోడ్​లోనూ ప్రేక్షకులకు అన్​స్టాపబుల్​ ఫన్​ అందించబోతున్నారని స్పష్టం అవుతోంది.

ఇవీ చదవండి:

సామ్​ అద్భుతమైన అమ్మాయి.. త్వరలోనే కోలుకోవాలని కోరుకుంటున్నా: చిరు

'అందరికీ భాయిజాన్​.. మరి మాకెందుకు పెద్దన్నలా ఉండరు?'.. సల్మాన్​పై నటి ప్రశ్నల వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.