ETV Bharat / entertainment

రష్మిక మార్ఫింగ్​ వీడియో విషయంలో విజయ్​ స్పందన - వారికి శిక్ష పడాలంటూ

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2023, 6:43 PM IST

Vijay Devarakonda Rashmika : నటి రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియోపై తాజాగా నటుడు విజయ్‌ దేవరకొండ స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

Vijay Devarakonda Rashmika
Vijay Devarakonda Rashmika

Vijay Devarakonda Rashmika : నేషనల్​ క్రష్​, కన్నడ నటి రష్మిక మందన్న మార్ఫింగ్‌ వీడియోపై ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు స్పందించి ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. సోషల్​ మీడియా వేదికగా ఆమెను సపోర్ట్​ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై తన కో స్టార్​ నటుడు విజయ్ దేవరకొండ స్పందించారు.

"భవిష్యత్తు కోసం ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాలి. మరో మహిళకు ఇటువంటిది జరగకూడదు. ఇలాంటి ఘటనలపై వెంటనే చర్యలు తీసుకునేందుకు ఓ సమర్థవంతమైన విభాగాన్ని ఏర్పాటు చేయాలి. దీని వెనక ఉన్న వారికి వెంటనే శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే మహిళలకు రక్షణ కలుగుతుంది" అంటూ విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ​ఇదే అంశంపై 'మా' అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఏఐ టెక్నాలజీ సాయంతో సినీతారల రక్షణకు భంగం కలిగించే వీడియోలను 'మా' ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ఇలాంటి వీడియోలను తయారుచేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

Vijay Devarakonda Rashmika
విజయ్​ దేవరకొండ ఇన్​స్టా స్టోరీ

ఏం జరిగిందంటే..
Rashmika Mandanna Deepfake Video : సోషల్ మీడియా వేదికగా కొందరు ఆకతాయిలు రష్మికకు సంబంధించిన ఓ ఫొటోను మార్ఫింగ్‌ చేసి దాన్ని ద్వారా ఓ అసభ్యకర వీడియోను సృష్టించారు. ఆ వీడియోలో రష్మికను కొంచం అశ్లీలంగా చూపించారు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. అయితే దీనిపై అనుమానం వచ్చిన కొందరు ఫ్యాన్స్​.. అసలు నిజాన్ని బయటపెట్టారు. దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోను ఇలా రూపొందిచినట్లు కనిపెట్టారు. ఈ క్రమంలో ఒరిజినల్‌ వీడియో, రష్మిక డీప్‌ఫేక్‌ మార్ఫింగ్‌ వీడియోను షేర్‌ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై అమితాబ్ బచ్చన్, సాయి ధరమ్ తేజ్, నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్ ఇలా పలువురు బాలీవుడ్​ టాలీవుడ్ ప్ర‌ముఖులు స్పందించి రష్మికకు మద్దతు తెలిపారు.

'టెక్నాలజీని చూస్తే భయమేస్తోంది'- రష్మిక 'డీప్​ ఫేక్​' వీడియోపై నాగచైతన్య స్పందన

Rashmika Mandanna New Movie : మరో సినిమాకు రష్మిక గ్రీన్​ సిగ్నల్​.. వీడియో రిలీజ్.. ఎవరికి 'గర్ల్​ఫ్రెండ్'​ కానుందో ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.