ETV Bharat / entertainment

చిరంజీవి బాలకృష్ణలో ఉన్న కామన్​ క్వాలిటీ ఏంటో తెలుసా?

author img

By

Published : Dec 27, 2022, 9:52 AM IST

Chiranjeevi Balakarishna common quality
చిరంజీవి బాలకృష్ణలో ఉన్న కామన్​ క్వాలిటీ ఏంటో తెలుసా?

ఆరు పదుల వయసులోనూ యంగ్​ హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ. వీరిద్దరు ఈ సంక్రాంతికి ఒక్కరోజు వ్యవధిలో తమ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఈ అగ్రహీరోలిద్దరిలో ఓ కామన్​ క్వాలిటీ ఉంది. అదేంటో తెలుసా?

చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఉన్న కామన్‌ క్వాలిటీ ఏంటో వివరించారు ప్రముఖ డ్యాన్స్​ కొరియోగ్రాఫర్​ శేఖర్ మాస్టర్​. ఈ సంక్రాంతి తనకెంతో ప్రత్యేకమని.. తాను నృత్యరీతులు సమకూర్చిన చిరు 'వాల్తేరు వీరయ్య', బాలయ్య 'వీరసింహారెడ్డి' చిత్రాలు రెండూ.. ఒక్కరోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రావడం.. అటు సంతోషంగానూ ఇటు ఒత్తిడిగానూ ఉందని అన్నారు.

మీరు నృత్య దర్శకత్వం చేసిన ఇద్దరు అగ్ర తారల చిత్రాలు ఒకేసారి విడుదలవుతున్నాయి. ఏమైనా ఒత్తిడిగా ఉందా?
రెండూ ఒకేసారి సంక్రాంతికి విడుదల కావడంతో కాస్త ఒత్తిడిగా అనిపిస్తోంది. అదేసమయంలో చాలా ఆనందంగానూ ఉంది. వాల్తేరు వీరయ్యలో అన్ని పాటలు చేశాను. వీరసింహారెడ్డిలో సుగుణ సుందరి, మా బావ మనోభావాలు.. గీతాలకు పని చేశాను.
ఇద్దరూ మంచి డ్యాన్సర్లే. వాళ్లతో పని చేయడం ఎలా అనిపించింది?
ఈ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదించా. వాళ్లిద్దరూ వృత్తిపట్ల ఎంతో నిబద్ధతతో ఉంటారు. ఒక మూమెంట్‌ వస్తే అది పూర్తయ్యే వరకు విశ్రమించరు. నేను రెండు మూడు ఆప్షన్స్‌ తీసుకొని వెళ్లి వారి బాడీ లాంగ్వేజ్‌కు ఏది బాగుంటుందో అది పెడతాను.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాల్లో మీకు సవాల్‌గా అనిపించిన పాటలేవి?
వాల్తేరు వీరయ్యలో ఓ మెలోడీ పాట కోసం ఫారిన్‌కు వెళ్లాం. అక్కడ మైనస్‌ 10డిగ్రీల వద్ద పని చేశాం. థర్మల్స్‌, జర్కిన్స్‌, బూట్స్‌, గ్లౌజ్స్‌ అన్నీ వేసుకున్నా అక్కడ నిలబడలేం. అలాంటి చలిలో చిరంజీవి, శ్రుతిహాసన్‌ ఎంతో కష్టపడి స్టెప్స్‌ వేశారు. 'వీరసింహారెడ్డి'లోని 'సుగుణ సుందరి' టర్కీలో తీశాం. అక్కడ భయంకరమైన ఎండ. ఈ రెండు పాటలు సవాల్‌గా అనిపించాయి.
ఈతరంలో ప్రతి డ్యాన్స్‌ మాస్టర్‌ సిగ్నేచర్‌ స్టెప్స్‌ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లున్నారు కదా..
ఇప్పుడు అందరి చేతిలో మొబైల్‌ ఉంది. రీల్స్‌ ఎక్కువైపోయాయి. పాట హిట్టయ్యిందా లేదా అనేది తర్వాత.. ముందు రీల్స్‌లో వచ్చే మూమెంట్‌ ఆకట్టుకుందంటే చాలు ఆ గీతం, సినిమా జనాల్లోకి వెళ్లిపోతుంది. అందుకే ఇప్పుడు సిగ్నేచర్‌ స్టెప్స్‌కు ఆదరణ పెరిగింది. నేను మొదటి నుంచీ దీన్ని ఫాలో అవుతూ వచ్చాను. ఇప్పుడు పాటల్లో కచ్చితంగా ఒక సిగ్నేచర్‌ స్టెప్పైనా ఉండాల్సిందే. ప్రస్తుతం మహేష్‌ - త్రివిక్రమ్‌ చిత్రానికీ, రవితేజ 'రావణాసుర.. టైగర్‌ నాగేశ్వరరావు సినిమాలకు నృత్య దర్శకుడిగా పని చేస్తున్నా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.