ETV Bharat / entertainment

బన్నీ మూవీలో నటించా.. డబ్బులు ఎగ్గొట్టారు!: వకీల్​సాబ్​ సూపర్​ ఉమెన్​ ఎమోషనల్

author img

By

Published : Nov 14, 2022, 9:49 AM IST

'వకీల్​సాబ్​' సినిమాతో సూపర్ ఉమెన్​గా గుర్తింపు తెచ్చుకున్న నటి లిరీష్​ షాకింగ్ కామెంట్స్ చేశారు! రెమ్యునరేషన్ విషయంలో తనకెదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలు..

Vakeel saab super women emotional
వకీల్​సాబ్​ సూపర్ ఉమెన్​ ఎమోషనల్

ఎంతో మంది సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ నటి కూడా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలిపారు. ఓ నిర్మాత తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని అన్నారు. ఆమెనె మరెవరో కాదు.. నటి లిరీష. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో లేడీ పోలీస్ పాత్రలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలో సూపర్ ఉమెన్​గా ఆమె పాత్ర థియేటర్స్‌లో ఈలలు వేయించింది.

తాజాగా లిరీష ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశారు. తనను చాలా మంది లావుగా ఉన్నావు అంటూ బాడీ షేమింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నిర్మాతలు సినిమాలు విడుదలైన తరువాత కూడా రెమ్యూనరేషన్ ఇవ్వలేదని బాధపడ్డారు. "నాకు చాలా వరకు నెగటివ్ పాత్రలలో నటించడం ఇష్టం. ముఖ్యంగా తమిళ భాషతో పాటు ఇతర భాషలలో కూడా నటించడం ఇష్టమే కానీ అవకాశాలు రావడం లేదు. నాకు పలు సీరియల్స్ ద్వారా కూడా మంచి గుర్తింపు వచ్చింది. చాలా మంది నన్ను లావు ఉన్నావు అంటారు. ఇప్పుడు నేను సన్నగా మారిపోతే హీరోయిన్​గా ఏమైన ఛాన్స్​ ఇస్తారా? నాకు ఇలా ఉండటమే ఇష్టం. నాకు లేని బాధ వారికి ఎందుకో అర్ధం కావటంలేదు. అలానే అందరు ఎదుర్కొన్నట్లు నేను డబ్బుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. 'తప్ప సముద్రం' అనే సినిమాకు రెమ్యూనరేషన్ ఇప్పటికీ రాలేదు. ఆ నిర్మాతకు ఎన్ని సార్లు ఫోన్ చేసిన.. స్పందనే ఉండదు. చివరకు నేనే వదిలేశా. ఇలా కొన్ని సినిమాల్లో సగం రెమ్యూనరేషనే వస్తుంది. ఇక్కడ ప్రొడక్షన్ పెద్దది, మంచిదే అయినప్పటికి మధ్యలో జరిగే కొన్నిటి వలన డబ్బులు మా వరకు రావటంలేదు. చాలా వరకు అలానే జరుగుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'వరుడు' సినిమాలో 40 రోజులు నటించాను. అయితే నా సీన్స్​ కనిపించవు. అప్పుడు కూడా సగం డబ్బులు రాలేదు. అలా కొన్ని సినిమాలతో పాటు సీరియల్స్​లో కూడా చాలా డబ్బులు వదులుకున్నాను" అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆమె మోడల్ కాదురా బాబోయ్​ పోలీస్ అంట ఇంతకీ ఈ అందగత్తె ఎవరంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.