ETV Bharat / entertainment

అటు సంక్రాంతి.. ఇటు వేసవి.. వినోదాల విందుకు సిద్ధమా?

author img

By

Published : Jan 1, 2023, 8:41 AM IST

ఏటా వచ్చే సంక్రాంతి కోసం ఎంతగానో ఎదురు చూస్తాం. ఎందుకంటే ఆ రోజు అసలు పండుగతో మరో పండుగ షురూ అవుతుంది. అదే సినిమా పండుగ. ఈ క్రమంలో ఈ ఏడు కూడా సంక్రాంతి బరిలోకి కోడిపుంజుల్లాగా మన టాలీవుడ్​ తారల సినిమాలు దిగుతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఓ సారి చూసేద్దామా..

tollywood -upcoming-movies-in-2023-a-glance
tollywood -upcoming-movies-in-2023-a-glance

ఏడాది తొలినాళ్లలో వచ్చే సంక్రాంతి పండుగ.. ఏటా సంబరాలతోపాటు, సినిమా సందడినీ తెచ్చిపెడుతుంది. ఈసారి ఆ రేసులో 'వీరసింహారెడ్డి'తో బాలకృష్ణ, వంశీపైడిపల్లి 'వారసుడు'తో విజయ్‌, 'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవి పోటీకి దిగుతున్నారు. పైగా ఇది చిరంజీవికి 154వ సినిమా. క్రిష్‌ దర్శకత్వంలో వచ్చే 'హరిహర వీరమల్లు'తో పవన్‌ కల్యాణ్‌ కూడా సిద్ధమవుతున్నాడు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో వస్తోన్న ఓ చిత్రంలో నవీన్‌ పోలిశెట్టితో కలిసి షెఫ్‌గా నటిస్తోంది అనుష్క. అన్విత రవళిశెట్టిగా వెండితెరమీద స్వీటీ ఏం వండబోతుందో ఈ ఏడాది తెలిసిపోతుంది. వరస విజయాలతో దూసుకుపోతున్న కల్యాణ్‌ రామ్‌ 'అమిగోస్‌'లో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్లాస్‌ హీరో సుధీర్‌ బాబు ఈ ఏడాది 'హరోం హర'తో మాస్‌ హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.

veera simha reddy
వీర సింహా రెడ్డి
waltair veerayya
వాల్తేరు వీరయ్య

వేసవి సందడి..
సంక్రాంతి తరవాత నిర్మాతలు ఎక్కువగా ఆశలు పెట్టుకునేది వేసవి సెలవులపైనే. ఈ వేసవికి విద్యార్థులతోపాటు- నానీ కూడా తెలంగాణ నేపథ్యంలో వస్తోన్న ‘దసరా’తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. చిరంజీవికి చెల్లిగా కీర్తిసురేశ్‌ నటిస్తోన్న 'భోళా శంకర్‌' కూడా వేసవి సెలవులపైనే ఆశలు పెట్టుకుంది. రామాయణం ఆధారంగా భారీ అంచనాలతో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన 'ఆదిపురుష్‌' వీఎఫ్‌ఎక్స్‌ పనులకోసం సంక్రాంతి బరి నుంచి వైదొలిగింది.

adipurush
ఆదిపురుష్​

సీక్వెల్‌ జోరు..
తగ్గేదేలే అంటూ 'పుష్ప2' తెరకెక్కిస్తున్న సుకుమార్‌ ఈ ఏడాదే ఆ సినిమాను విడుదల చేయనున్నాడు. ఇప్పటికే మణిరత్నం కలల ప్రాజెక్ట్‌ 'పొన్నియిన్‌ సెల్వన్‌' కమర్షిల్‌ సక్సెస్‌ను అందుకుంది. తమిళంతోపాటు ఇతర భాషల్లోనూ ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా రెండో భాగం ఈ ఏడాదే ప్రేక్షకుల్ని అలరించడానికి వస్తోంది. దాంతోపాటు లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కార్తీ నటించిన ‘ఖైదీ’కి సీక్వెల్‌గా 'ఖైదీ2' చిత్రీకరణ జరుగుతోంది. శంకర్‌- కమల్‌హాసన్‌ కాంబోలో 'ఇండియన్‌ 2' ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకొస్తోంది. 'డీజే టిల్లు'గా నవ్వించిన సిద్ధూ జొన్నలగడ్డ ఈసారి ‘టిల్లు స్క్వేర్‌’తో తెరకెక్కుతున్న సీక్వెల్‌లో అలరించబోతున్నాడు.

వాయిదా..
మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల- దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న 'శాకుంతలం' 2022లో విడుదల కావల్సింది. కానీ, 3డీలో కనువిందు చేయడానికి వాయిదా పడి ఈఏడాదే తెర మీదకొస్తోంది. అల్లు అర్జున్‌ కూతురు అర్హ బాలనటిగానూ వెండితెర మీద కనిపించబోతోంది. అలానే విజయ్‌ దేవరకొండ- సమంత నటించిన 'ఖుషి' కూడా విడుదల తేదీని ప్రకటించినా కొన్ని అనివార్య కారణాలతో అదీ 2023లో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అఖిల్‌ 'ఏజెంట్‌' కూడా అదే బాటలో నడిచింది. ఫిజికల్‌గా మేకోవర్‌ అయి ఎయిట్‌ ప్యాక్‌ లుక్‌లో కనిపించబోతున్నాడు అఖిల్‌. పాన్‌ ఇండియా స్థాయిలో దక్షిణాది భాషలతోపాటు బాలీవుడ్‌లోనూ ఈ సినిమా రిలీజ్‌ చేయడానికి సిద్ధమయ్యారు నిర్మాతలు. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో రూపుదిద్దుకున్న 'హనుమాన్‌' కూడా వాయిదా వల్ల ఈ సంవత్సరం తెరమీదకొస్తోంది.

shaakuntalam
శాకుంతలం

జత కలిసే..
మహేశ్‌బాబు- త్రివిక్రమ్‌ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రభాస్‌-ప్రశాంత్‌ నీల్‌ కలయికలో వచ్చే 'సలార్‌' కూడా భారీ అంచనాలతోనే రాబోతోంది. ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చే, పేరు ఖరారు కాని సినిమాలూ 2023 కోసమే రూపుదిద్దు కుంటున్నాయి. అలానే రామ్‌చరణ్‌ పదిహేనో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీటితోపాటు మరికొన్ని సినిమాలూ వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి..

ntr prashant neel
ఎన్టీఆర్​, ప్రశాంత్​ నీల్​
hari hara veera mallu
హరిహర వీర మల్లు

ఇదీ చదవండి:

పవన్​ కల్యాణ్ 'ఖుషి' మేనియా.. థియేటర్‌లో అకీరా సందడి..

నయా జోష్​.. డబుల్ ఫన్​.. 2023లో క్రేజీ మూవీస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.