ETV Bharat / entertainment

Guntur Karam : గుంటూరు కారం నుంచి పూజా ఔట్!.. తమన్ బాటలోనేనా?

author img

By

Published : Jun 20, 2023, 12:40 PM IST

Updated : Jun 20, 2023, 1:48 PM IST

actress pooja hegde and music director thaman
actress pooja hegde and music director thaman

టాలీవుడ్​ సూపర్ స్టార్​ మహేశ్​ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ కాంబోలో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం'లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ ప్రాజెక్ట్​ను నుంచి సంగీత దర్శకుడు తమన్​ తప్పుకోనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు బుట్టబొమ్మ పూాజా హెగ్డే కూడా తప్పుకుంటారన్న వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏమైందంటే ?

Mahesh babu Guntur Kaaram : సూపర్ స్టార్​ మహేశ్​ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్​ మూవీ 'గుంటూరు కారం'. పూజ హెగ్డే, శ్రీలీల లాంటి స్టార్స్​ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్​ రాక కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్​కు వరుస షాక్​లు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్​ నుంచి మ్యూజిక్​ డైరెక్టర్​ తమన్​ తప్పుకున్నాన్న వార్తలు హల్​చల్​ చేయగా.. తాజాగా హీరోయిన్​ పూజా హెగ్డే కూడా ఈ సినిమా నుంచి బయటకి రానున్నారని సమాచారం. దీంతో ఫ్యాన్స్​ ఆందోళన చెందుతున్నారు.

తమన్​ ప్లేస్​లో మరో డైరెక్టర్​​..
Guntur Karam Music Director : ఇక ఇటీవలే మ్యూజిక్​ డైరెక్టర్​ తమన్​ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారన్న వార్తలు సోషల్​ మీడియాలో హల్​చల్​ చేశాయి. త‌మ‌న్‌ ప్లేస్​లో అనిరుద్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రీప్లేస్ చేశార‌ని కొంద‌రు అంటే.. మ‌రికొందరేమో జీవీ ప్ర‌కాష్ కుమార్‌ను తీసుకున్నారంటూ నెట్టింట పోస్ట్​ చేశారు. అయితే తమన్​ ట్విట్టర్​ వేదికగా రెండు పోస్ట్​లు పెట్టారు. అందులో వ‌లిచిన అర‌టిపండు ఫొటోను అప్​లోడ్​ చేసిన తమన్​ "కడుపు మంట‌కు అర‌టిపండ్లు చాలా మంచివి" అన్న క్యాప్షన్​ రాసుకొచ్చారు. మరో ట్వీట్​లో "మా స్టూడియో దగ్గర మజ్జిగ స్టాల్‌ను ఓపెన్ చేస్తున్నా వచ్చి తాగండి. కడుపు మంటకి మజ్జిగ చాలా మంచిది" అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ ట్వీట్స్​ ఎవరిని ఉద్దేశించి పెట్టారన్న విషయంపై క్లారిటీ లేదు.

  • And also From Tom I am starting #Buttermilk Stall for free of cost at my studios people suffering with stomach burning symptoms are welcome 🙏 pls get cured 👌🏼🤠

    Good nite lots of work ahead don’t want to waste my time 🕰️ 🙏 and urs also #peace & #love
    ♥️🫶 and
    some… pic.twitter.com/e2Fx7xkA6d

    — thaman S (@MusicThaman) June 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రొడ్యూసరేమో ఇలా..
Guntur Kaaram Producer : ఇంతటి గందరగోళం నడుమ అఫీషియల్​ అప్డేట్​ వస్తుందన్న తరుణంలో 'గుంటూరు కారం' నిర్మాత నాగవంశీ ఓ నెటిజన్​ పెట్టిన ట్వీట్​కు రిప్లై ఇచ్చారు. ధంబ్స్​ అప్​ అనే ఎమోజీ పెట్టారు. దీంతో ఆయన ఈ రూమర్స్​కు కాస్త చెక్​ పెట్టినట్టు అనిపించినప్పటికీ ఈ విషయం అధికారికంగా తెలిసేంతవరకు రూమర్స్​ ఆగవంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొందరు ఫ్యాన్సేమో ఈ రూమర్స్​ నిజమైతే ఇక సినిమా సంక్రాంతికి రిలీజవ్వడం డౌటే అంటూ సోషల్​ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.

netizen tweet
నెటిజన్ ట్వీట్​కు నాగవంశీ రిప్లై
Last Updated :Jun 20, 2023, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.