ETV Bharat / entertainment

Tiger Nageswara Rao Opening Collections : ఫస్ట్​ డే రిపోర్ట్​.. 'లియో', 'భగవంత్​ కేసరి' కన్నా తక్కువే.. ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 10:56 AM IST

Tiger Nageswara Rao Opening Collections : మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఓపెనింగ్స్​ వివరాలు బయటకు వచ్చాయి. ఎన్ని కోట్లంటే?

Tiger Nageswara Rao Opening Collections : ఫస్ట్​ డే రిపోర్ట్​.. 'లియో', 'భగవంత్​ కేసరి' కన్నా తక్కువే.. ఎంతంటే?
Tiger Nageswara Rao Opening Collections : ఫస్ట్​ డే రిపోర్ట్​.. 'లియో', 'భగవంత్​ కేసరి' కన్నా తక్కువే.. ఎంతంటే?

Tiger Nageswara Rao Opening Collections : మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా శుక్రవారం(అక్టోబర్ 20) థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ అయిన ఈ సినిమా తొలి షో నుంచే డిసెంట్​ టాక్​ తెచ్చుకుంది.

ఈ చిత్రానికి తెలుగులో 53.18 శాతం ఓవరాల్ ఆక్యుపెన్సీని వచ్చినట్లు తెలుస్తోంది. నైట్ షోలలో 69.72 శాతం ఆక్యుపెన్సీ, మార్నింగ్ షోలలో 49.46శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. హైదరాబాద్‌లో 360షోలు వేయగా 56.5% ఆక్యుపెన్సీ నమోదైంది. అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఓపెనింగ్ డే రూ. 5.50 కోట్ల షేర్‌.. ఇండియా వైడ్​గా అన్నీ భాషల్లో రూ.8కోట్ల నెట్​ వసూలు చేసినట్లు తెలిసింది. ఈ చిత్రానికి పోటీగా ఒకరోజు ముందుగా రిలీజైన బాలయ్య భగవంత్​ కేసరికి రూ.14.36కోట్లు, దళపతి విజయ్​ రూ.8.31కోట్లకు పైగా వచ్చాయి.

కాగా, రవితేజ కెరీర్​లో ఇదే బిగ్ ఓపెనింగ్స్​. తెలుగు రాష్ట్రాల వరకు చూస్తే.. రెండోది. రావణాసుర రూ.4.29కోట్లు, ధమాకా రూ.4.66కోట్లు, రామారావు ఆన్ డ్యూటీ రూ.2.82కోట్లు, ఖిలాడీ రూ.4.30కోట్లు, క్రాక్​ రూ.6.25కోట్లు, డిస్కో రాజా రూ.2.54కోట్లు, అమర్ అక్బర్ ఆంటోని రూ.3.40కోట్లు వసూలు చేశాయి. అంటే వీటిలో క్రాక్​ మూవీ భారీ ఓపెనింగ్స్​ను అందుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Tiger Nageswara Rao Review : ' టైగర్ నాగేశ్వరరావు' చిత్రాన్ని 1970 కాలంలో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా రూపొందించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమాలో ఆరంభ స‌న్నివేశాలు, ర‌వితేజ న‌ట‌న, సంగీతం, ఛాయాగ్ర‌హ‌ణం ప్లస్​లుగా నిలిచాయి. క‌థ‌, క‌థ‌నాలు ఆస‌క్తి మరీ ఎక్కువగా రేకెత్తించలేదు, భావోద్వేగాలు కాస్త కొరవడడం మైనస్​లు అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

Leo Movie Day 2 Collections : కాస్త డౌన్​.. ఇండియాలో రూ.100కోట్ల క్లబ్​లోకి.. మొత్తంగా ఎంతంటే?

Bhagvant Kesari Day 2 Collections : 'భగవంత్​ కేసరి'.. తీవ్ర పోటీలోనూ బాలయ్య జోరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.