ETV Bharat / entertainment

Guess Who Is This Cute Looking Child? : ఈ చిన్నారి సౌత్​ ఇండస్ట్రీని ఊపేసిన స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టగలరా..?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 4:28 PM IST

Star Actress Childhood Photo Story : సినీ తారల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై.. అభిమానులకు అమితాసక్తి ఉంటుంది. ఏ చిన్నవిషయమైనా సరే.. తెలుసుకోవడానికి, వినడానికి చాలా ఇంట్రస్ట్ చూపిస్తారు. అలాంటి ఓ విషయమే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి.. స్టార్ హీరోయిన్​గా సౌత్ ను ఊపేసింది. మరి, ఆమె ఎవరో గుర్తు పట్టగలరా..?

Actress Childhood Photo
Star Actress Childhood Photo

Star Actress Childhood Photo Story : సినిమా హీరోయిన్ అంటే.. స్కిన్ షో చేయాల్సిందే అన్నది మెజారిటీ అభిప్రాయం. అందులో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. కానీ.. ఎలాంటి ఎక్స్​పోజింగ్ చేయకుండానే.. స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారి చర్చరాగానే.. సావిత్రి(Actress Savitri), సౌందర్య(Actress Soundarya) వంటి తారలు మదిలో మెదులుతారు. ఈ జాబితాలో.. మరో భామ కూడా చేరుతుంది. ఆమె మరెవరోకాదు.. తెలుగుతోపాటు సౌత్​లో స్టార్ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకున్న స్నేహ.

Star Actress Childhood Photo Story  : స్నేహ
Star Actress Childhood Photo Story : స్నేహ

Actress Sneha Childhood Photo News : పై ఫొటోలో.. చూడ చక్కగా కనిపిస్తున్న ఆ చిన్నారి మరెవరో కాదు.. స్టార్ యాక్ట్రెస్ స్నేహ. ఈ నటి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో గోపించంద్ నటించిన 'తొలివలపు' సినిమాతో టాలీవుడ్​లో అడుగుపెట్టింది. అయితే.. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ.. రెండో చిత్రంలో హీరో తరుణ్​(Actor Tharun)కు జోడిగా 'ప్రియమైన నీకు' సినిమాలో నటించింది. ఈ మూవీ అప్పట్లో యూత్​ను తెగ ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అప్పట్నుంచి స్నేహ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Star Actress Childhood Photo Story  : స్నేహ
Star Actress Childhood Photo Story : స్నేహ

ఆ హీరోయిన్​ నవ్వుకు స్టేట్ అవార్డు

ఎక్కువగా క్లాస్ సినిమాల్లో మాత్రమే స్నేహ నటించింది. ఫ్యామిలీ, లవ్ వంటి కథలను ఎంచుకొని మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర హీరోల సరసన నటించి సౌత్​లో స్టార్ హీరోయిన్​గా నిలిచింది. హనుమాన్ జంక్షన్’, ‘శ్రీ రామదాసు’, ‘సంక్రాంతి’, ‘రాధా గోపాలం’, ‘వెంకీ’ లాంటి పలు చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

Star Actress Childhood Photo Story  : స్నేహ
Star Actress Childhood Photo Story : స్నేహ

తెలుగు అమ్మాయే..!

Actress Sneha Childhood Photo Viral in Social Media : నటి స్నేహ తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి. ఆమె పూర్వీకులు ఏపీలోని రాజమండ్రిలో నివసించారు. ఆ తర్వాత.. ఆమె తల్లిదండ్రులు రాజారామ్, పద్మావతి.. ముంబాయికి వెళ్లారు. హీరోయిన్ స్నేహ అక్కడే జన్మించారు. మలయాళ దర్శకుడు పాజిల్ చొరవతో స్నేహ సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆమె ఫస్ట్ మూవీ 'ఓరు నీల పక్షి'. ఆ తర్వాత సౌత్ మొత్తం విస్తరించారు.

Star Actress Childhood Photo Story  : స్నేహ
Star Actress Childhood Photo Story : స్నేహ

వన్నె తగ్గని అందం.. స్నేహా సొంతం

Actress Sneha Prasanna Latest News : చాలా కాలం పాటు స్టార్ స్టేటస్ కొనసాగించిన స్నేహ.. ఈ క్రమంలోనే తమిళ డైరెక్టర్ ప్రసన్నతో లవ్​లో పడ్డారు. వీరిద్దరూ 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన తర్వాత కొంత కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత.. సన్నాఫ్ సత్యమూర్తి(Son of Satyamurthy) , వినయవిధేయ రామ వంటి చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం స్నేహ పలు ప్రకటనల్లో నటిస్తున్నారు.

Star Actress Childhood Photo Story  : స్నేహ
Star Actress Childhood Photo Story : స్నేహ

'చంద్రముఖి'గా స్నేహ చేయాల్సింది.. కానీ!

Samantha: హీరోయిన్ సమంతకు గుడి కడుతున్న అభిమాని.. ఎక్కడంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.