ETV Bharat / entertainment

'నాటు నాటు'కు కొరియన్ల స్టెప్పులు.. వీడియో చూసి మురిసిపోయిన మోదీ!

author img

By

Published : Feb 26, 2023, 3:41 PM IST

naatu naatu
naatu naatu

'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాలోని నాటు నాటు పాట ఎన్నో అవార్డులతో పాటు ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. ఇప్పటికే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో మంది ఈ పాటకు స్టెప్పులేయగా తాజాగా కొరియాలోని భారత్​ ఎంబసీ సిబ్బంది కూడా ఈ పాటకు డ్యాన్స్​ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

భారత్​లోనే కాదు ప్రపంచమంతటా 'ఆర్​ఆర్​ఆర్​' మ్యానియా కొనసాగుతోంది. సినిమా రిలీజైన తొలి రోజు నుంచే థియేటర్​లో మంచి రెస్పాన్స్​​ తెచ్చుకున్న ఆ మూవీ.. బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతే కాకుండా చిత్ర యూనిట్​కు అవార్డుల పంట పండిస్తోంది. విడుదలై ఏడాదియినప్పటికీ తగ్గేదేలే అంటూ విశ్వవేదికలపై చెలరేగిపోతోంది. ప్రతిష్ఠాత్మక గోల్డెన్​ గ్లోబ్​ అవార్డులను తెచ్చిపెట్టడమే కాకుండా ఆస్కార్​ బరిలో తెలుగోడి సత్తా చాటేందుకు సిద్ధమయ్యింది.

కాగా, ఈ సినిమాలోని నాటునాటు పాట.. ప్రపంచమంతటా వేరే లెవెల్​లో క్రేజ్​ సంపాదించుకుంది. చంద్రబోస్​ సాహిత్యం, కీరవాణి బాణీలు, కాలభైరవ- రాహుల్​ సిప్లిగంజ్​ల గాత్రం, ప్రేమ్​ రక్షిత్​ కొరియోగ్రఫీ.. వీటిన్నంటిని జోడించగా వచ్చిన నాటు నాటు అనే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది 'ఆర్​ఆర్​ఆర్​' టీమ్​. థియేటర్​లో ఈ పాట విన్న అభిమానులు.. స్టెప్పులేశారు. ఫంక్షన్​ ఏదైనా సరే.. డీజేలో ఈ పాట తప్పక ఉండాల్సిందే. అయితే ఈ పాటకు తాజాగా ఇండియాకు చెందిన సౌత్​ కొరియన్​ ఎంబసీ ఉద్యోగులు​ ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేశారు.

కొరియన్​ వనితలు పాటకు తగ్గట్టుగా డ్యాన్స్​ చేయగా.. పురుషులు కూడా ఎన్టీఆర్​, చరణ్​లా డ్రెస్​ వేసుకుని నాటు నాటు స్టెప్పులేశారు. ఈ వీడియోను కొరియాలోని ఇండియా ఎంబసీ తన ట్విట్టర్​ అకౌంట్​లో షేర్​ చేసింది. అయితే ఈ ట్వీట్​ను చూసిన ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో మురిసిపోయారు. వీడియో ఎంతో బాగుందని.. టీమ్​ చేసిన కృషి ఇంకా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు.

కాగా, అంతర్జాతీయ వేదికలపై 'ఆర్​ఆర్​ఆర్​' టీమ్ ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. ప్రస్తుతం దర్శకుడు రాజమౌళితో పాటు మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. గత ఐదు రోజులుగా అమెరికాలో పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.