ETV Bharat / entertainment

CCLలో అదరగొట్టిన తెలుగు వారియర్స్​.. వరుసగా రెండో గెలుపు.. పాయింట్ల పట్టికలో టాప్

author img

By

Published : Feb 26, 2023, 10:52 AM IST

Updated : Feb 26, 2023, 11:15 AM IST

సీసీఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్)లో తెలుగు వారియర్స్ దూసుకెళ్తున్నారు. వరుసగా రెండోసారి విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్నారు. బంగాల్​తో జరిగిన మ్యాచ్​లో 8 వికెట్ల తేడాతో తెలుగు వారియర్స్ విజయం సాధించింది.

telugu warriors vs bengal tigers
తెలుగు వారియర్స్

సీసీఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్)లో తెలుగు వారియర్స్ సత్తా చాటింది. కెప్టెన్ అక్కినేని అఖిల్ సారధ్యంలో జట్టు మరో విజయాన్ని కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్​లో కేరళపై గెలుపొందిన తెలుగు వారియర్స్.. వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ అఖిల్ మరోసారి చెలరేగిపోవటం వల్ల బంగాల్​పై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

తొలి ఇన్నింగ్స్​లో బంగాల్ టైగర్స్ 10 ఓవర్లలో 114 పరుగులు చేసింది. కాగా ఆ జట్టు.. 32 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. అయితే జిష్షు సేన్​గుప్తా విజృంభించటం వల్ల బంగాల్ టైగర్స్ భారీ స్కోరుకు చేరుకుంది. ఆ తర్వాత బరిలో దిగిన తెలుగు వారియర్స్ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 126 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్​లో 12 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. బెంగాల్ టైగర్స్​తో జరిగిన ఈ మ్యాచ్​లో కేవలం 26 బంతుల్లో 57 రన్స్​ చేశాడు అఖిల్. ఈ మ్యాచ్​లో అశ్విన్ బాబు కూడా 17 బంతుల్లో 43 పరుగులు చేశాడు.

ఆ తర్వాత జరిగిన రెండో ఇన్నింగ్స్​లో బెంగాల్ టైగర్స్ కెప్టెన్ జిష్షు సేన్​ గుప్తా 83 రన్స్ చేశాడు. దీంతో 10 ఓవర్లలో 126 పరుగులు చేసింది బెంగాల్ టీమ్. మొదటి ఇన్నింగ్స్​లో 12 పరుగుల ఆధిక్యంలో ఉండటం వల్ల తెలుగు వారియర్స్ విజయానికి 114 పరుగులు అవసరమయ్యాయి. బ్యాటింగ్ వచ్చిన అశ్విన్ 62 పరుగులతో చెలరేగడం వల్ల తెలుగు వారియర్స్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో తెలుగు వారియర్స్ టీమ్ సీసీఎల్ 2023 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

కాగా రాయ్​పుర్ వేదికగా కేరళ స్ట్రైకర్స్​తో జరిగిన తొలి మ్యాచ్​లో 64 పరుగుల తేడాతో తెలుగు వారియర్స్ అద్భుత విజయాన్ని సాధించింది. సీసీఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్) 2011లో ప్రారంభమైంది. 2019 వరకు ఏటా ఈ టోర్నీని నిర్వహించేవారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా మూడేళ్లపాటు ఈ టోర్నీ నిర్వహణ సాధ్యం కాలేదు. కాగా ప్రస్తుతం సీజన్​లో ఈ టోర్నీలో 8 జట్లు పోటీపడుతున్నాయి. మార్చి 19న హైదరాబాద్​ వేదికగా ఈ సీజన్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Last Updated :Feb 26, 2023, 11:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.