ETV Bharat / entertainment

ఫ్యాన్స్​కు కల్యాణ్​ రామ్ గుడ్​ న్యూస్​.. బింబిసార సీక్వెల్​ ఎప్పుడంటే?

author img

By

Published : Feb 8, 2023, 1:44 PM IST

bimbisara
bimbisara 2

టైం ట్రావెల్​ డ్రామాగా తెరెకెక్కిన రీసెంట్​ హిట్​ మూవీ బింబిసార. కల్యాణ్ రామ్​ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతే కాకుండా అంచనాలకు మించి బాక్సాఫీస్​ వసూళ్లను కొల్లగొట్టింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్​ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్న అభిమానుల కోసం గుడ్​ న్యూస్​ షేర్​ చేశారు కల్యాణ్​ రామ్​. అదేంటంటే..

బింబిసార సినిమాతో సక్సెస్​ అందుకున్న నందమూరి కల్యాణ్​ రామ్​ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. పీరియాడికల్​ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు మించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆడియన్స్​ ఈ సినిమాకు బాగా కనెక్టయ్యారు. అంతే కాకుండా ఈ సినిమాతో టాలీవుడ్​లో కల్యాణ్​ రామ్ క్రేజ్​ మరింత పెరిగింది. అయితే ఈ సినిమా మరింత ఎక్కువ సేపు ఉంటే బాగుంటుంది అని ఫీలైన ఫ్యాన్స్​ ఎంతో మంది ఉన్నారు. అలా ఫీలవుతున్న అభిమానుల కోసం ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్​ను తెరకెక్కిస్తున్నట్లు కల్యాణ్​ రామ్​ చెప్పారు. కానీ ఎప్పుడు వస్తుందనే విషయం పై క్లారిటీ ఇవ్వలేదు.

ప్రస్తుతం అమిగోస్​ సినిమా షూటింగ్​ కంప్లీట్​ చేసిన కల్యాణ్​ రామ్​ తన తదుపరి ప్రాజెక్ట్​ డెవిల్​ షూటింగ్​లో నిమగ్నమయ్యారు. దీంతో ఇక బింబిసార వచ్చే ఏడాది సెట్స్​పైకి వస్తుందని ఫ్యాన్స్​ అందరూ ఫిక్సైపోయారు. ఇక అంత వరకు వెయిట్​ చేయాలంటూ నిరాశ చెందుతున్న సమయంలో కల్యాణ్​ రామ్​ ఓ గుడ్​ న్యూస్​ తెలియజేశారు. అదేంటంటే డెవిల్ సినిమా షూటింగ్ దాదాపు 70% పూర్తయిందని.. ఇక వశిష్ఠతో కలిసి ఈ ఏడాది చివరి కల్లా బింబిసారను సెట్స్​పైకి ఎక్కించే పనుల్లో ఉంటామంటూ తెలిపారని సినీ వర్గాల సమాచారం.

ఈ అప్డేట్​ విన్న ఫ్యాన్స్​ ఆనందానికి అవధుల్లేవు. ఇక తప్పకుండా సీక్వెల్​ను చూడొచ్చు అంటూ తమ సంతోషాన్ని సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం కల్యాణ్​ రామ్​ 'అమిగోస్'​ సినిమాతో మూడు విభిన్న పాత్రల్లో నటించారు. రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.