ETV Bharat / entertainment

ఆ సిరీస్​లో సామ్​ రోల్​​ పర్మనెంట్​.. పోస్టర్​తో తేల్చి చెపిన మేకర్స్​..!

author img

By

Published : Feb 1, 2023, 12:19 PM IST

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంత వరుస ఆఫర్లతో బిజీగా ఉంటోంది. ఇప్పటికే యశోదా సక్సెస్​ను ఆస్వాదిస్తున్న ఈ తార తన అప్​కమింగ్​ మూవీ శాకుంతలం రిలీజ్​ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో మరో కొత్త ప్రాజెక్ట్​లో అడుగుపెట్టింది సామ్​. ఆ విషయాలు మీ కోసం..

samanta in citadel series
samanta in citadel series

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్​ ప్రైమ్​లో విడుదలవ్వనున్న సిటాడెల్ యూనివర్స్ అనే ఇండియన్ సిరీస్​లో సామ్​ నటిస్తోందని అప్పట్లో పలు వార్తలు వచ్చాయి. 'ఫ్యామిలీమ్యాన్‌' సృష్టికర్తలు రాజ్‌-డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్​లో సామ్​ వరుణ్​ ధావన్​తో స్క్రీన్ షేర్​ చేసుకుంటున్నట్లు సోషల్​ మీడియాలో టాక్​ నడిచింది. అయితే యశోద తర్వాత తన ఆరోగ్య రీత్యా ఈ ప్రాజెక్ట్​ నుంచి తప్పుకుందని.. పర్మనెంట్​గా ప్రాజెక్ట్​కు దూరమయ్యిందన్న న్యూస్​ సైతం సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కాగా వీటన్నింటికి ఓ అఫిషియల్​ పోస్టర్​తో ఫుల్​ స్టాప్​ పెట్టింది అమెజాన్​ సంస్థ. తాజాగా సిటాడెల్​లో సమంతకు సంబంధించిన కొత్త స్టిల్‌తో తను ప్రాజెక్ట్​లో ఓ భాగమని అనౌన్స్​ చేశారు. మరో వైపు ఈ సిరీస్​ షూటింగ్​ ముంబయిలో జరుగుతోంది. కాగా ముంబయితో పాటు నార్త్​ ఇండియా, సెర్బియా అలాగే దక్షిణాఫ్రికాలో కూడా సిటాడెల్ చిత్రీకరణ జరుగుతుందని మేకర్స్​ తెలిపారు..

సమంతతో కలిసి పనిచేయడం చాలా థ్రిల్లింగా ఉందని రాజ్, డీకే ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ముగ్గురూ ఇంతకుముందు ది ఫ్యామిలీ మ్యాన్ 2కు పనిచేశారు. గూఢచర్యం నేపథ్యంలో సాగే ఈ కథ కోసం వరుణ్‌ ధావన్‌, సమంత తొలిసారి కలిసి నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరు గూఢచారులుగా కనిపించనున్నారట. ఈ సిరీస్‌ సెట్స్‌పైకి వెళ్లే ముందు వరుణ్‌ ధావన్‌, సమంత ఇద్దరూ యాక్షన్‌ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.