ETV Bharat / entertainment

రష్మికకు సూపర్​ ఆఫర్​.. ఆలియా స్థానంలో!

author img

By

Published : Apr 21, 2022, 8:59 AM IST

హీరోయిన్​ ఆలియా భట్​కు ఇటీవలే రణ్​బీర్​ కపూర్​తో గ్రాండ్​గా పెళ్లి జరిగింది. దీంతో ఆమె షూటింగ్​లకు కాస్త విరామం ఇచ్చి భర్తతో సరదాగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో.. ఆమె వదులుకున్న ఓ సినిమా ఛాన్స్​ ఇప్పుడు హీరోయిన్​ రష్మికను వరించింది! ఇంతకీ ఆ సినిమా ఏంటంటే?

rashmika alia bhatt
రష్మిక ఆలియా

NTR 30 Aliabhatt Rashmika: 'జనతా గ్యారేజ్‌' తర్వాత ఎన్టీఆర్‌-దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మరో చిత్రాన్ని గతంలోనే ప్రకటించారు. జూన్​లో సెట్స్​పైకి వెళ్లనుంది. అయితే ఈ పాన్‌ ఇండియా చిత్రంలో బాలీవుడ్‌ నటి అలియాభట్‌ కథానాయికగా ఎంపికైందంటూ గతంలో వార్తలొచ్చాయి. కాగా, ఇటీవలే ఆమె పెళ్లి చేసుకోని బిజీ ఆవ్వడం వల్ల ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే మరో కొత్త హీరోయిన్​ పేరు తెరపైకి వచ్చింది. ఆలియా స్థానాన్ని కథానాయిక రష్మికతో భర్తీ చేయనున్నట్లు సినీ వర్గాల టాక్​. ​ ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

ఇక.. నందమూరి కల్యాణ్‌రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కొరటాల శివ శైలి, సామాజిక అంశాలతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం తారక్​ శరీరాకృతిని మార్చుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా ఖరారు చేసినట్లు తెలిసింది. 'జనతా గ్యారేజ్‌' లాంటి హిట్‌ తర్వాత ఎన్టీఆర్‌-కొరటాల కలయిక నుంచి వస్తున్న చిత్రం కావడం వల్ల.. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదీ చూడండి: జై జవాన్​.. సిల్వర్​ స్క్రీన్​ సోల్జర్స్​గా మారిన మన హీరోలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.