ETV Bharat / entertainment

బాలయ్య-చంద్రబాబు ఎపిసోడ్ 'అన్ స్టాపబుల్'.. ఈ సారి గెస్ట్​గా రమ్యకృష్ణ

author img

By

Published : Oct 19, 2022, 7:01 PM IST

Ramyakrishna as chief guest to balakrishna unstoppable
అన్​స్టాపబుల్​లో రమ్యకృష్ణ

బాలకృష్ణ అన్​స్టాపబుల్ సీజన్​ 2​ తొలి ఎపిసోడ్​ రికార్డు సాధించింది. అలాగే తాజా ఎపిసోడ్​లో సీనియర్ నటి రమ్యకృష్ణ సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని ఆహా సోషల్​మీడియాలో ట్వీట్ చేసింది.

బాలకృష్ణ అన్​స్టాపబుల్​ సీజన్ 2 సైతం మంచి ఆదరణతో దూసుకుపోతుంది. నారా చంద్రబాబు నాయుడు చీఫ్​ గెస్ట్​గా వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ విపరీతమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది. అయితే ఈ ఎపిసోడ్​ తొలి నాలుగు రోజుల్లోనే 100 మిలియన్ మినిట్స్​ స్ట్రీమింగ్స్​ అయినట్లు ఆహా పేర్కొంది. 'అతడొచ్చాడు, పాలించాడు. హిస్టరి క్రియేట్ చేశాడు మళ్లీ' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది.

ఇక సెకండ్ ఎపిసోడ్ గెస్ట్స్ గా యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నల గడ్డ సందడి చేశారు. ఈ ఇద్దరు కుర్ర హీరోలతో బాలయ్య సంభాషణ ఎంటర్​టైన్​గా సాగింది. అమ్మాయిలకు లైన్ వేసే విషయాల నుంచి చీకటి పడ్డాక వేసే పెగ్ వరకూ అన్ని విషయాల గురించి సరదా సరదాగా మాట్లాడుకున్నారు.

balayya chandrababu
బాలయ్య-చంద్రబాబు ఎపిసోడ్ 'అన్ స్టాపబుల్'

అయితే ఇక ఆ తర్వాత ఎపిసోడ్ కోసం బాలయ్య.. ఓ అందాల భామను సిద్ధం చేశారు. ఆమె మరెవరో కాదు నీలాంబరిగా ఆడియన్స్ మదిలో నిలిచిపోయిన సీనియర్​ నటి రమ్యకృష్ణ.. ఇప్పుడు యువతరం మదిలో శివగామిగా చెరగని ముద్ర వేశారు. ఆమె తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ఇప్పటికీ కెరీర్​లో దూసుకెళ్తున్నారు. అమెనే ఈ ఎపిసోడ్​తో బాలయ్యతో సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా సోషల్​మీడియాలో ట్వీట్ చేసింది. ఈ ఎపిసోడ్​ ప్రీమియర్​ ఈ శని, ఆదివారం రాత్రి 9గంటలకు ప్రసారం కానున్నట్లు తెలిపింది.

Ramyakrishna  unstoppable
గెస్ట్​గా రమ్యకృష్ణ

అయితే ఈ షోలో.. బాలయ్య.. ఆమెను ఎలాంటి ప్రశ్నలను అడుగుతారో చూడాలి. అయితే ఆమెకు.. తన భర్త కృష్ణ వంశీతో విబేధాలు ఉన్నట్లు గతంలో వచ్చాయి. ఇంకా కొన్ని కాంట్రవర్సీ విషయాల్లోనూ ఆమె పేరు వినిపించింది. ఈ సున్నితమైన విషయాలను బాలయ్య టచ్​ చేసే అవకాశముందని నెటిజన్లు భావిస్తున్నారు. కాగా, బాలయ్య-రమ్యకృష్ణ కలిసి గతంలో వంశోద్ధారకుడు, దేవుడు సహా పలు చిత్రాల్లో నటించారు.

ఇదీ చూడండి: విష్ణుప్రియ ఫేస్​బుక్​లో పోర్న్​ ఫొటోస్​ షాక్​లో ఫాలోవర్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.