ETV Bharat / entertainment

'సలార్​ అప్డేట్​ ఎప్పుడు?' సూసైడ్​ నోట్​లో ప్రభాస్​ అభిమాని​!

author img

By

Published : May 10, 2022, 9:16 PM IST

Updated : May 10, 2022, 9:54 PM IST

prabhas
ప్రభాస్

Salaar Movie Update: ప్రభాస్‌ అభిమాని రాసిన ఒక లెటర్​ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ​'సలార్‌' అప్‌డేట్‌ ఇవ్వకపోతే సూసైడ్‌ చేసుకుంటానని ఆ అభిమాని అందులో పేర్కొనడం గమనార్హం.

Salaar Movie Update: కేజీఎఫ్​ డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్​- రెబల్​స్టార్​ ప్రభాస్​ కాంబినేషన్​లో వస్తున్న సలార్​ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న 'డార్లింగ్' అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను ప్రకటించి.. చాలా కాలం అయినా.. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్​ రాలేదు. దీంతో ప్రభాస్‌ అభిమాని ఒకరు 'సలార్‌' అప్‌డేట్‌ ఇవ్వకపోతే సూసైడ్‌ చేసుకుంటా అంటూ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌కు రాసిన లెటర్​ ఒకటి సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'సినిమా మొదలై ఇన్ని నెలలో అవుతున్నా.. ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్​ ఇవ్వలేదు. మే చివరి వారంలోగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వకపోతే నేను సూసైడ్‌ చేసుకుంటా' అని ఆ లేఖలో ఉంది. అయితే ఈ లెటర్​ రాసిన అభిమాని పేరు.. తదితర వివారాలు మాత్రం అందులో ఆ లేఖలో లేవు.

Prabhas
అభిమాని రాసిన లేఖ

ఇదీ చదవండి: శంకర్ డైరెక్షన్​లో తారక్​!.. పుట్టినరోజున రెండు సినిమాల నుంచి సర్​ప్రైజ్​లు!

Last Updated :May 10, 2022, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.