శంకర్ డైరెక్షన్​లో తారక్​!.. పుట్టినరోజున రెండు సినిమాల నుంచి సర్​ప్రైజ్​లు!

author img

By

Published : May 10, 2022, 7:31 PM IST

Updated : May 10, 2022, 10:54 PM IST

NTR
ఎన్టీఆర్ ()

పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులకు 'ఫ్యాన్ ​మీల్స్' వడ్డించనున్నారు జూనియర్​ ఎన్టీఆర్. తన తదపరి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్​ రిలీజ్​ చేసి.. అభిమానులకు అదిరిపోయే సర్​ప్రైజ్​లు ఇవ్వనున్నట్లు సమాచారం.

'ఆర్​ఆర్​ఆర్​' విజయంతో పాన్​ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు జూనియర్​ ఎన్టీఆర్​. ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. 'ఎన్టీఆర్ 30'కి కొరటాల శివ దర్శకుడు కాగా.. ఎన్టీఆర్ 31కి ప్రశాంత్​ నీల్​ డైరెక్షన్​ చేయనున్నారు. అయితే ఈ రెండు సినిమాలను అదిరిపోయే సర్​ప్రైజ్​లను అభిమానులకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి ఆయా నిర్మాణ సంస్థలు.

ఈ నెల 20న జూనియర్​ ఎన్టీఆర్​ పుట్టిన రోజు సందర్భంగా.. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్​ రానున్నట్లు సమాచారం. పుట్టిన రోజు కానుకగా.. అభిమానుల కోసం ఆ సినిమాలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్​ చేయనున్నట్లు సోషల్​ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జూన్​లో ఎన్టీఆర్​ 30, అక్టోబర్​లో ఎన్టీఆర్ 31 చిత్రాలు సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్​లో ఎన్టీఆర్​ చెప్పారు.

శంకర్​- ఎన్టీఆర్​ కాంబోలో..

అలాగే డైరెక్టర్​ శంకర్​- ఎన్టీఆర్​ కాంబోలో ఓ సినిమా రానున్నట్లు సమాచారం. ఎన్టీఆర్​కు సరిపోయే కథను శంకర్​ సిద్ధం చేసుకున్నారట. త్వరలోనే కథను ఎన్టీఆర్​కు వినిపించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వీరిద్దరి కాంబోలో సినిమా సెట్​ అయితే.. మరో రేంజ్​లో ఉంటుందనంలో సందేహం లేదు.

Last Updated :May 10, 2022, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.