ETV Bharat / entertainment

'ఆదిపురుష్' బాక్సాఫీస్.. తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ ఫిక్స్!

author img

By

Published : Jun 12, 2023, 9:54 AM IST

Updated : Jun 12, 2023, 12:23 PM IST

Adipurush pre release bussiness
'ఆదిపురుష్' బాక్సాఫీస్.. తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ ఫిక్స్!

Adipurush pre release bussiness : ప్రభాస్ నటించిన ఆదిపురుష్​ ఇంకో నాలుగు రోజుల్లో రిలీజ్ కానుంది. అయితే తెలుగులో ఈ చిత్ర థియేట్రికల్​ బిజినెస్​ వివరాలు బయటకు వచ్చాయి.

Adipurush pre release bussiness : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్'​ మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్​గా రిలీజ్​ కానుంది. రామాయణం ఆధారంగా ఇది రూపొందిన ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్​లో బుక్కింగ్స్ మొదలై జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్​లో తెలుగు, హిందీ ఆడియెన్స్​ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే బిజినెస్ కూడా జరిగిందని తెలిసింది. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. ఏరియా వైడ్​గా బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

  • నైజాంలో - 50 కోట్లు
  • సీడెడ్- 17.60 కోట్లు
  • ఉత్తరాంధ్ర - 14.50 కోట్లు
  • తూర్పు గోదావరి - 8.80 కోట్లు
  • పశ్చిమ గోదావరి - 7.20 కోట్లు
  • గుంటూరు - 8.60 కోట్లు
  • కృష్ణా జిల్లా - 8.50 కోట్లు
  • నెల్లూరు - 4.80 కోట్లు

మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 120 కోట్ల బిజినెస్ జరిగిందట. అంటే రూ. 121 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్​. ఈ కలెక్షన్స్ మొదటివారంలోనే వచ్చేస్తాయని అభిమానులు, సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, తెలుగులో ఈ సినిమా హక్కులను పీపుల్స్​ మీడియా ఫ్యాక్టరీ కొనుగోలు చేసింది.

భారీ స్థాయిలో ఓపెనింగ్స్​.. ప్రభాస్ నటించిన ఏ సినిమా అయినా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ అందుకుంటాయి. అంతకుముందే ఈ విషయం సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. 'బాహుబలి' తర్వాత మళ్ళీ ఆ రేంజ్​లో సక్సెస్ చూడకపోయినప్పటికీ కూడా.. ప్రభాస్ ప్రతి సినిమాకు అదే స్థాయిలో బజ్​ క్రియేట్​ అవుతూ వస్తోంది. వరల్డ్​వైడ్​గా 'బాహుబలి 2'కు రూ.215 కోట్లు, 'సాహో' రూ.125 కోట్లు, 'రాధే శ్యామ్'​ రూ.67కోట్లు ఓపెనింగ్ గ్రాస్​ వచ్చాయి. ఇక ఇప్పుడు రామాయణం ఆధారంగా రూపొందిన 'ఆదిపురుష్' సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి కాబట్టి.. ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Adipurush Cast : అత్యాధునిక సాంకేతిక హంగులతో ఈ 'ఆదిపురుష్​' చిత్రాన్ని రూపొందించారు. ప్రభాస్​ శ్రీరాముడిగా, కృతిసన్​ సీతగా, సైఫ్​ అలీఖాన్​ రావణాసురుడిగా, సన్నీసింగ్‌ లక్ష్మణుడిగా, దేవదత్త నాగే వత్సల్‌ సేన్‌ ఆంజనేయడిగా, సోనాల్‌ చౌహాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం కార్తీక్‌ పల్నాని అందించగా.. అజయ్‌ - అతుల్‌ సంగీతం సమకూర్చారు.

ఇదీ చూడండి :

KGFను బీట్​ చేసిన ఆదిపురుష్​.. అడ్వాన్స్​ బుకింగ్స్​కు అదిరిపోయే రెస్పాన్స్​!

Adipurush Drone Show : ఆదిపురుష్ ఈవెంట్‌లో డ్రోన్ షో!.. అరే అద్భుతాన్ని మిస్సయ్యామే!!

Last Updated :Jun 12, 2023, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.