ETV Bharat / entertainment

Parineeti Chopra Raghav Chadha Wedding : వెడ్డింగ్​ డ్రెస్​లో కొత్త జంట ఫన్నీ డ్యాన్స్​.. వీడియో భలే ఉందిగా!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 12:37 PM IST

Parineeti Chopra Raghav Chadha Wedding
Parineeti Chopra Raghav Chadha Wedding

Parineeti Chopra Raghav Chadha Wedding : బీటౌన్​ క్యూట్​ కపుల్​ పరిణీతి చోప్రా- ఆమ్​ ఆద్మీ ఎంపీ రాఘవ్​ చద్దా ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నారు. తాజాగా తన పెళ్లి ఫొటోలతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ జంట.. తాజాగా ఓ వీడియోలో సందడి చేస్తూ కనిపించారు. దాన్ని మీరు కూడా చూసేయండి..

Parineeti Chopra Raghav Chadha Wedding : బాలీవుడ్​ నటి​​ పరిణీతి చోప్రా, ఆమ్​ ఆద్మీ ఎంపీ రాఘవ్​ చద్దా మూడు ముళ్లు బంధంతో ఒక్కటయ్యారు. ఉదయ్​పుర్​లోని లీలా ప్యాలెస్​ వేదికగా ఈ పెళ్లి అట్టాహాసంగా జరిగింది. ఈ స్టార్​ కపుల్ వివాహ వేడుకలకు పలువురు క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే వేడుకల్లో అమలైన నో ఫోన్​ పాలసీ కారణంగా పెళ్లి ఫొటోలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఆ ఫొటోలను పరిణీతి తన ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో షేర్ చేశారు. ఇక ఆ పోస్ట్​ కింద కామెంట్ల రూపంలో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఫ్యాన్స్​ వాటిని నెట్టింట ట్రెండ్​ చేస్తున్నారు.


ఈ క్రమంలో పెళ్లి ఫొటోలతో పాటు ఓ వీడియో తెగ వైరల్​ అవుతోంది. అందులో ఈ క్యూట్​ జంట చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఓ గొడుగు కింద ఈ ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా.. పరిణితీ డ్యాన్స్​ చేస్తూ సందడి చేసింది. దీన్ని చూసిన ఫ్యాన్స్​ పరిణీతి ఎంతో క్యూట్​గా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనితో పాటు కొన్ని వీడియోలు కూడా తెగ ట్రెండ్​ అవుతున్నాయి.


రాఘవ్​ గ్రాండ్​ ఎంట్రీ.. పెళ్లిలో స్పెషల్​ డిషెస్​..
వరుడిగా ముస్తాబైన రాఘవ్​ చద్దా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఉదయ్​పుర్​లోని లీలా ప్యాలస్​ నుంచి తాజ్​ లేక్​ ప్యాలస్​ వరకు బంధుమిత్రులతో కలిసి 18 పడవలలో వెళ్లారు. ఆ తర్వాత లీలా ప్యాలెస్​కు చేరుకున్న రాఘవ్​, అతిథులకు.. పరిణీతి చోప్రా కుటుంబం శీతల పానియాలు, డ్రైఫ్రూట్స్​, స్వీట్స్​ ఇచ్చి ఘనంగా స్వాగతం పలికింది. ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటల సమయంలో లీలా ప్యాలెస్​లోని పెళ్లి మండపంలో వేద మంత్రాల సాక్షిగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో పరిణీతి-రాఘవ్​ ఒక్కటయ్యారు.


ఇక వివాహానికి వచ్చిన అతిథులకు వివిధ రాష్ట్రాల వంటలు రుచి చూపించారు. ప్రత్యేకంగా రాజస్థాన్​, పంజాబ్​​ వంటలతో సహా ఇటాలియన్, ఫ్రెంచ్​ డిషెస్​ కూడా వడ్డించారు. ఆదివారం రాత్రి 8 గంటల తర్వాత గ్రాండ్​ రిసెప్షన్​ ఏర్పాటు చేశారు. ఇక వివాహ వేడుకల కోసం శుక్రవారమే ఈ జంట ఉదయ్​పుర్​కు వచ్చింది. వీరి తర్వాత ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు అక్కడికి చేరుకున్నారు. శనివారం ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరిగాయి. హల్దీ, సంగీత్​ వేడుకలు ఘనంగా జరిగాయి.

Parineeti Chopra Raghav Chadha Wedding Pics : రాయల్​ లుక్​లో కొత్త జంట.. పెళ్లి ఫొటోలు అదిరిపోయాయి!

గ్రాండ్​గా పరణీతి చోప్రా, రాఘవ్​ చద్ధా ఎంగేజ్​మెంట్​.. ఫొటోలు చూశారా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.