ETV Bharat / entertainment

Mokshagna Latest Pics : సింహం యాటకొచ్చే సమయం వచ్చినట్టుంది.. 'భగవంత్ కేసరి' సెట్స్​లో మోక్షజ్ఞ

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 7:36 AM IST

Mokshagna Latest Pics in Bhagavanth Kesari Sets : నందమూరి నట సింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ.. తన తండ్రి బాలయ్య నటిస్తున్న 'భగవంత్ కేసరి' సెట్స్​ను సందర్శించారు. ఆ ఫొటోస్​ ప్రస్తుతం నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Mokshagna Latest Pics in Bhagavanth Kesari Sets
Mokshagna Latest Pics : సింహం యాటకొచ్చే సమయం వచ్చినట్టుంది.. భగవంత్ కేసరిలో మోక్షజ్ఞ

Mokshagna Latest Pics in Bhagavanth Kesari Sets : నందమూరి నట సింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సిల్వర్​ స్క్రీన్​ ఎంట్రీ కోసం.. నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ఫిల్మ్​ ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. ఎప్పుడెప్పుడు అతడు ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడా..? అని ఎంతో ఆశగా ఉన్నారు. కానీ, అది మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. అయితే గత కొద్ది రోజులుగా మోక్షజ్ఞకు సంబంధించిన లుక్స్​, ఫొటోస్​ సోషల్​మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్యలో మోక్షజ్ఞ కాస్త స్లిమ్​గా మారడం, ఆ మధ్య నందమూరి సుహాసిని కొడుకు పెళ్లిలో ఎన్టీఆర్​తో కలిసి సందడి చేయడం.. అలా ఆ ఫొటోస్​ అన్నీ బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి నెట్టింట్లో మోక్షజ్ఞ హాట్​టాపిక్​గా మారారు. తాజాగా ఆయన బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సెట్స్​ను సందర్శించారు. దర్శకుడు అనిల్​రావిపూడి, శ్రీలీల, కొరియోగ్రాఫర్​ శేఖర్​ మాస్టర్​తో కలిసి ముచ్చటిస్తూ కనిపించారు.

ఈ పిక్స్​లో మోక్ష‌జ్ఞ ముఖంలో తేజస్సు బాగా కనపడుతోంది! గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్​గా కనిపిస్తున్నాడు. ఈ ఫొటోస్​​ ప్రస్తుతం సోషల్​మీడియాలో ఫుల్ ట్రెండ్​ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు మోక్షజ్ఞ లుక్ మెస్మరైజింగ్​గా ఉంది, ఓ యంగ్​ హీరోకు ఉండాల్సిన లక్షణాలు అన్ని నందమూరి నటవారసుడులో కనిపిస్తున్నాయి, పులి బయటకొచ్చింది, సింహం యాటకొచ్చే సమయం వచ్చినట్టుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా, మోక్షజ్ఞ(mokshagna first movie director) ఎంట్రీ విషయంలో గత కొంతకాలంగా చాలా దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఓ సందర్భంలో తానే దర్శకుడిగా మోక్షజ్ఞ సినిమా ఉండొచ్చని బాలయ్య అన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత పలువురు దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. మొదట మాస్ దర్శకుడు బోయపాటి వినిపించగా.. ఆ తర్వాత ఫన్​ డైరెక్టర్​ అనిల్​ రావిపూడి, రా అండ్ రస్టిక్​ శ్రీకాంత్ ఓదెల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. చూడాలి మరి నందమూరి బాలయ్య నట వారసుడు మోక్ష‌జ్ఞ టాలీవుడ్​ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో? ఎవరితో ఉంటుందో అనేది.

JR NTR Mokshagna : ఎన్​టీఆర్​​ను ఆప్యాయంగా హత్తుకున్న మోక్షజ్ఞ.. ఇప్పుడీ ఫొటోనే సోషల్​మీడియా సెన్సేషన్​..

Mokshagna Latest Photos : ఒకే ఫ్రేమ్​లో ఎన్టీఆర్-మోక్షజ్ఞ.. రాయల్ లుక్​ అదిరింది బాసూ.. ఈ పిక్​ చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.