ETV Bharat / entertainment

అయ్యో సుమ.. పెద్ద ప్రమాదమే తప్పింది.. లేదంటే..!

author img

By

Published : May 7, 2022, 4:03 PM IST

Updated : May 7, 2022, 10:42 PM IST

suma
సుమ

'జయమ్మ పంచాయితీ' సినిమా షూటింగ్​ సమయంలో యాంకర్​ సుమకు పెను ప్రమాదమే తప్పింది. ప్రమాదానికి సంబంధిన వీడియోను సుమ సోషల్​ మీడియోలో షేర్​ చేయగా.. అది ఇప్పుడు వైరల్​గా మారింది.

స్టార్​ యాంకర్​ సుమ లీడ్​ రోల్​లో నటించిన చిత్రం 'జయమ్మ పంచాయితీ'. ప్రస్తుతం ఈ సినిమా.. థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్​ సమయంలో సుమకు పెద్ద ప్రమాదమే తప్పింది. అడవిలో షూటింగ్​ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నీటి ప్రవాహం వద్ద సుమ నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న రాళ్లకు నాచు పేరుకుపోగా.. కొంచెం కాలు కదిపే సరికి.. ఆమె జారి కింద పడ్డారు. అయితే ఆమె కింద పడినా.. బ్యాలెన్స్​ కంట్రోల్​ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం తనంతట తానే పైకి లేచారు సుమ.

అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను శనివారం తన ఇన్​స్టాలో పోస్ట్‌ చేశారు సుమ. 'కొద్దిలో ప్రమాదం తప్పింది' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఈ వీడియో చూశాక.. సుమ అభిమానులు, నెటిజన్ల నుంచి కామెంట్లు వెల్లు వెత్తుతున్నాయి. 'సుమక్క మీకేమైనా అయితే.. ప్రీరిలీజ్​లు, టీఆర్​పీ రేటింగ్​లకు ఇబ్బందే' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇదీ చదవండి: భర్తతో కత్రినా రొమాన్స్.. స్విమ్మింగ్ ​పూల్​లో రచ్చ మామూలుగా లేదుగా!

Last Updated :May 7, 2022, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.