ETV Bharat / entertainment

'వాల్తేరు వీరయ్య' టైటిల్​ సాంగ్​ అదుర్స్.. ఫ్యాన్స్​కు ఇక పూనకాలే..​

author img

By

Published : Dec 26, 2022, 7:53 PM IST

Updated : Dec 26, 2022, 9:16 PM IST

waltair veerayya title song released
waltair veerayya title song released

మెగాస్టార్​ చిరంజీవి మాస్​ గెటప్​లో​ వస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని టైటిల్​ సాంగ్​ విడుదలైంది.

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో ఆయన సందడి చేశారు. ఇదే వరుసలో ఆయన నటిస్తున్న మరో చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇదివరకే విడుదలైన ఫస్ట్​లుక్ పోస్టర్, టీజర్‌తో సినిమా అంచనాలు భారీగా పెరిగాయి. ఇక బాస్​ పార్టీ సాంగ్​తో ఫ్యాన్స్​ పండగ చేసుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'భగ భగ భగ మండే.. మగ మగ మగ మగాడు వీడే..' అంటూ సాగే టైటిల్​ సాంగ్​ విడుదలైంది. ఇంటెన్స్​ మ్యూజిక్​, పవర్​ ఫుల్​ బీజీఎమ్​తో ఉన్న ఈ పాట ఫ్యాన్స్​ ఉర్రూతలూగిస్తోంది.​ ఈ పాటను అనురాగ్​ కురకర్ణి చాలా అద్భతంగా పాడారు. హీరో క్యారక్టర్​ను ఎలివేట్​ చేసే విధంగా ఉంది ఈ పాట.

అయితే దీని కంటే ముందు మెగాస్టార్​ చింరజీవి ఫొటోను చిత్ర యూనిట్​ విడుదల చేసింది. చిరు గ్యాంగ్​ లీడర్​ సినిమాలోని ఓ మాస్​ లుక్​లో ఉన్న ఫొటోను అచ్చం అలాగే రీక్రియేట్​ చేశారు. దీంతో వింటేజ్​ చిరంజీవి వాల్తేరు వీరయ్యలో మల్లీ కనిపిస్తారని ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ అవుతున్నారు.
ఇక, ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడి పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్. వైజాగ్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు మెచ్చేలా దర్శకుడు బాబీ సినిమాను రూపొందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated :Dec 26, 2022, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.